Gachibowli: గదిలో ఉరేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని - ఫ్రెండుకు మెసేజ్ పంపి అఘాయిత్యం
Gachibowli: హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాంగూడాలోని ఓ అపార్టుమెంట్ లో ఇద్దరు స్నేహితులైన రూమ్ మేట్స్ తో కలిసి కృతి సంబ్యాల్ నివాసం ఉంటోంది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న జమ్మూ కశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ అనే 27 ఏళ్ల యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రూం మేట్స్ గదిలో లేని సమయంలో ఈమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాంగూడాలోని ఓ అపార్టుమెంట్ లో ఇద్దరు స్నేహితులైన రూమ్ మేట్స్ తో కలిసి కృతి సంబ్యాల్ నివాసం ఉంటోంది. అలా గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరు రూమ్ మేట్స్ రూమ్ లో లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితుడు సచిన్ కుమార్ కు కృతి మెసేజ్ పంపింది. సచిన్ హుటాహుటిన వచ్చి చూడగా కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది.
హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే కృతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు, విచారణ చేస్తున్నారు.