By: ABP Desam | Updated at : 28 Jun 2022 08:20 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad T Hub 2.0: హైదరాబాద్ చరిత్రలోనే ఐటీ రంగంలో సరికొత్త అధ్యయనానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ ను ఈరోజు సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభించున్నారు. హైదరాబాద్, రాయదుర్గంలో 3.14 ఎకరాల్లో రూ.400 కోట్లతో టీ హబ్ 2 నిర్మాణం జరిగింది. గతంలో టీ హబ్ వన్ నిర్మించిన తరువాత ఊహించని స్దాయిలో స్పందన రావడం, అందులోనూ టీ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీ లు ప్రారంభించాలనుకునే యువ ప్రారిశ్రామికవేత్తల సంఖ్య ఎక్కువ అయింది.
ఫలితంగా అంత మందికి అవకాశం అవకాశం కల్పించాలంటే అప్పట్లో సమస్యలు తలెత్తడంతో ఎమినిది వందల మంది లోపల ఉంటే వెయ్యి మంది స్టార్టప్ కోసం వేచిచూస్తున్న యువత బయట వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సి వచ్చేది. దీంతో టీ హబ్ టూ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 2015లో టీ హబ్ 2 కు శంకుస్థాపన జరిగింది. కోవిడ్ క్లిష్ట పరిస్దితుల్లో సైతం టీ హబ్ నిర్మాణం వేగంగా జరిగింది. అత్యంత ఆకర్షణీమైన నిర్మాణంగా టీ హబ్ 2 నిలిచింది.
నిత్యం సమాజంలో ప్రజల అవసరాలు, సమస్యలు ఇలా వీటికి టెక్నాలజీ జోడించి పరిష్కారం చూపేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువకులకు టీ హబ్ అండగా నిలుస్తుంది. వారి ఆలోచనలకు మెరుగులు దిద్ది, ఆర్థిక చేయూతను అందించి వారిని స్టార్టప్ కంపెనీలు స్థాపించే విధంగా ప్రొత్సహిస్తుంది. ఇలా ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో టీ హబ్ 2 , తెలంగాణ ఐటీ రంగంలో దూసుకుపోనుంది. ఇప్పటికే టీ హబ్ వన్ ద్వారా 1,100 మంది యువకులు స్టార్టప్ కంపెనీలు స్థాపించుకోగలిగారు. ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో టీ హబ్ 2 ముందుకు వెళ్లనుందని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఏబీపీ దేశంతో అన్నారు.
ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న టీ హబ్ 2 ప్రారంభోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ప్రముఖులు పాల్గొననున్నారు. యువత ఆలోచనలకు ప్రోత్సాహం ఎలా కల్పిస్తున్నారో.. స్టార్టప్ కంపెనీ సవాళ్లు, లక్ష్యాలు ఇలా అనేక అంశాలపై సమావేశాలు జరుగతాయి. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్ 2 అధికారికంగా ప్రారంభమవుతుంది.
MLC Kavitha: మునుగోడు మాదే- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే: కవిత
నెక్స్ట్ తెలంగాణ డీజీపీ ఎవరు? పోటీలో ఎవరెవరున్నారంటే?
Hyderabad: హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్స్ టెన్షన్! నిండుతున్న ఆస్పత్రులు - ఆ జ్వరాన్ని ఇలా గుర్తించండి
IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !