అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad: జూపార్కులో గంధపు చెట్ల నరికివేత! దుంగలు స్వాధీనం - ఆలస్యంగా వెలుగులోకి

ఈ నెల 20వ తేదీన జూ అధికారులు ఏడు గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు. అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు గంధపు చెట్లను నరికి, దుంగలుగా చేసి ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్కులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం నెహ్రూ జూలాజికల్​ పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు  ఏడు గంధపు చెట్లు నరికివేసి ఎత్తుకెళ్లిన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలుగా చేసి అందులోని కొన్ని దుంగలు ఎత్తుకెళ్లిపోగా కొన్ని ఘటన స్థలం సమీపంలో దొరికాయి. నెహ్రూ జూలాజికల్​ పార్కులో వన్య ప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జూ అధికారులు ఏడు గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు. అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జూ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జూ అధికారులు బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గంధం చెట్లు దొంగతనాలకు గురవుతున్న నేపథ్యంలో జూపార్కులో పరిసరాలలో అదనంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేష్​ జై స్వాల్​ జూ అధికారులను ఆదేశించారు. 

రెండు రోజుల క్రితం జూ పార్కులో ఏడు గంధపు చెట్లను నరికి వేసిన ప్రాంతాన్ని శనివారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జూపార్కులో జూ అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని క్యూరేటర్​కు సూచించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు  సెక్యూరిటీని కూడా నియమించాలన్నారు. జూ చుట్టూ ఎలక్ట్రికల్​ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూపార్కులో జంతువుల సంరక్షణ , వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో జూ పార్కు డైరెక్టర్​ వినయ్ కుమార్​, క్యూరేటర్​ ప్రశాంత్​ బాజిరావు పాటిల్​ తో పాటు జూ అధికారులు పాల్గొన్నారు. గతంలో కూడా జూ పార్కులో గంధపు చెట్లు ఇలానే గుర్తు తెలియని వ్యక్తులు నరికి తీసుకెళ్లిన ఘటనలు వెలుగు చూశాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget