అన్వేషించండి

New Year Restrictions: డిసెంబర్‌ 31పై హైదరాబాద్ పోలీసుల భారీ ఆంక్షలు- ఒక్క మిస్టేక్ చేసినా కేసులు తప్పవు!

న్యూఇయర్‌ వేడుకల వేళ డ్రంకెన్‌ డ్రైవ్‌పై పోలీసులు ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 31న రాత్రి తాగి డ్రైవ్‌ చేస్తే జైలుకు పంపుతామన్నారు. క్యాబ్‌ డ్రైవర్లు డ్రైవ్‌ నిరాకరించినా జరిమానా వేస్తామంటున్నారు.

Restrictions on New Year Celebrations: న్యూఇయర్‌ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నగరవాసులు. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు న్యూఇయర్‌ వేడుకలకు  సిద్ధమవుతున్నారు. పబ్బులు, బార్లు, క్లబ్బులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో నగరవాసులను.. ఆకర్షించే పనిలో మునిగిపోయి ఉన్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు  పలుకుతూ... కొత్త సంవత్సరానికి మంచి జోష్‌తో గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పబోతున్నారు. అయితే... ఈ వేడుకల్లో ఎక్కడా శృతిమించొద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌  పోలీసులు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. 

డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి నుంచి న్యూఇయర్‌ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపేవారితోపాటు... అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతివేగం, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంపింగ్‌, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం‌, హెల్మెట్‌  పెట్టుకోకపోవడం వంటివి గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

న్యూఇయర్‌ వేడుకల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. 31వ తేదీ రాత్రి అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌డ్రైవ్‌  నిర్వహించబోతున్నారు పోలీసులు. గత ఏడాది రాత్రి 10గంటల తర్వాత డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించేవారు. కానీ... ఈ సారి రాత్రి 8గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు  చేస్తామంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ ఒకసారి పట్టుబడితే రూ.10వేల జరిమానా.... 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అదే... డ్రెంకెన్‌ డ్రైవ్ చేస్తూ ఎక్కువసార్లు దొరికితే రూ.15వేల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందట. అంతేకాదు డ్రైవింగ్‌  లైసెన్సు సస్పెన్షన్‌ చేసేందుకు సిఫారసు చేస్తారు పోలీసులు. సరైన పత్రాలు లేకుండా నడిపే వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా,  మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. కేసులు పెడతారు. వాహనం నడిపిన వారితోపాటు యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అధిక శబ్దాలు కూడా చేయకూడదట. పెద్దపెద్ద సౌండ్‌ సిస్టమ్స్‌లో పాటలు పెట్టుకున్నా... వాహనాలకు నంబరు ప్లేట్‌ లేకున్నా సీజ్‌ చేస్తామని చెప్తున్నారు.  కార్లల్లో కిక్కిరిసి కూర్చున్నా... కారు పైభాగంలో కూర్చుని ప్రయాణించినా కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. ఇక... ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై 31వ తేదీ రాత్రి 10  నుంచి ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలు తప్ప... ఇతర వాహనాలను అనుమతించరు. శిల్పాలేఅవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ,  షేక్‌పేట, మైండ్‌ స్పేస్‌, రోడ్‌ నం.45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్జి, సైబర్‌ టవర్స్‌, ఫోరం మాల్‌, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్‌, బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు కూడా మూసేస్తారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తారు. 

క్యాబ్‌ డ్రైవర్లకు కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని... రైడ్‌ నిరాకరిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. ట్యాక్సీ,  క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపారు. అంతేకాదు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించకూడదని... ఎట్టిపరిస్థితుల్లో రైడ్‌ నిరాకరించకూడదని స్పష్టం చేశారు. రూల్స్‌ మీరితే... మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద 500 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ఎవరైనా క్యాబ్‌ డ్రైవర్‌...  రైడ్‌ రద్దు చేస్తే... 9490617346 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు పోలీసులు. క్యాబ్‌ నెంబర్‌, సమయం, ప్రదేశం తదితర వివరాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు  సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Embed widget