MMTS trains Cancelled: 13, 14 తేదీల్లో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు - వివరాలు ఇవే!
MMTS trains Cancelled: ఈనెల 13, 14వ తేదీల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. ట్రాక్ మెయింటనెన్స్, ఆపరేషనల్ పనుల నేపథ్యంలోనే ఇలా చేస్తున్నట్లు వివరించారు.
![MMTS trains Cancelled: 13, 14 తేదీల్లో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు - వివరాలు ఇవే! Hyderabad MMTS trains cancelled Today and Tomorrow Due to Track maintenance Operational Works MMTS trains Cancelled: 13, 14 తేదీల్లో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు - వివరాలు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/8e0bdf7efdcdf998a5262de1903d20e71673583839965519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
MMTS trains Cancelled: హైదరాబాద్ పరిధిలోని ఎంఎంటీఎస్ సర్వీసులను ఈరోజు, రేపు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు. జంటనగరాల పరిధిలోని ట్రాక్ మెయింటనెన్స్, ఆపరేషనల్ పనుల నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. లింగంపల్లి - నాంపల్లి రూట్ లో రెండు, నాంపల్లి - లింగంపల్లిలో మూడు, ఫలక్ నుమా - లింగంపల్లి రూట్ లో ఐదు సర్వీసులను రద్దు చేసినట్లు చెప్పారు. లింగంపల్లి - ఫలక్ నుమా మార్గంలో ఆరు సర్వీసులు, రాంచంద్రాపురం - ఫలక్ నుమాలో ఒకటి, ఫలక్ నుమా - రాంచంద్రాపురం మార్గంలో ఒకటి, ఫలక్ నుమా -నాంపల్లి మార్గంలో ఒకటి... ఇలా మొత్తం 19 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Cancellation of #MMTS Trains on 13th and 14th January, 2023 pic.twitter.com/eQxJJs7OGB
— South Central Railway (@SCRailwayIndia) January 12, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)