Hyderabad Metro: బీజేపీ సభ ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం, ఈ స్టేషన్లు క్లోజ్ - ఇక్కడ మెట్రోరైళ్లు ఆగవు
Hyderabad Metro: కారిడార్ 2, కారిడార్ 3 లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ అసౌకర్యం కలుగుతుందని, కారిడార్ 1 మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఎలాంటి మార్పులు ఉండబోవని మెట్రో అధికారులు తెలిపారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నందున భద్రతా కారణాల వల్ల హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతంలో ఎక్కువగా ప్రధాని సహా వీవీఐపీల మూమెంట్ ఉండడం వల్ల మెట్రో స్టేషన్లపై ఆంక్షలు విధించింది. అందుకోసం ప్యారడైస్ (Paradise Metro Station), పరేడ్ గ్రౌండ్ (Parade Ground), జేబీఎస్ (JBS) మెట్రో స్టేషన్లను మూసి ఉంచనున్నట్లు మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. ఆదివారం (జులై 3) సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ 3 మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణిస్తున్న రైళ్లు ఇక్కడ ఆగబోవని స్పష్టం చేశారు. కాబట్టి, ప్రయాణికులు గుర్తించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు చూసుకోవాలని సూచించారు.
కారిడార్ 2, కారిడార్ 3 లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ అసౌకర్యం కలుగుతుందని, కారిడార్ 1 మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఎలాంటి మార్పులు ఉండబోవని మెట్రో అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన ఉన్నందున భద్రతా కారణాల వల్ల మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Dear Metro passengers,
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 3, 2022
The below Metro Stations will be closed between 5:30 PM & 8 PM today(Sunday), in view of the security concerns around our Honourable Prime Minister’s public meeting at Parade Grounds.
We regret the inconvenience @md_hmrl @hmrgov #ImportantAnnouncement pic.twitter.com/Wo62sQakpq
Adivaram Angadi ఆదివారం అంగడి మరోవైపు, నగరవాసులను ఆకట్టుకునేలా హైదరాబాద్ మెట్రో ‘ఆdivaram అngadi’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పంజాగుట్ట గలేరియాలో జులై 3న ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ ఒక ఎక్స్ పో తరహాలో ఇది ఉంటుందని ట్వీట్ చేశారు. ఇందులో వివిధ రకాల ఉత్పత్తులకు చెందిన స్టాల్స్‌తో పాటు, జనాలకు ఆసక్తికలిగించే ఎన్నో యాక్టివిటీస్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. లైవ్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా అందులో పేర్కొంది.
We are super excited to invite you to the event "Adivaram Angadi" today - 3 July from 9am to 9 pm at Expo Galleria near Punjagutta Metro Station !
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 3, 2022
Spend a beautiful Sunday exploring the various stalls and activities, especially curated for you!
See you there. pic.twitter.com/EoGDC6zlqY