Hyderabad Suicide:: పెళ్లైన ప్రేయసి కాదంది.. పెళ్లైన ప్రియుడు ఆమె ముందే కాల్చేసుకున్నాడు
ఓ మహిళకు పెళ్లేంది. భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లైన మరోవ్యక్తికి దగ్గరైంది. కొన్ని రోజులుగా ప్రియుడిని దూరం పెట్టింది. ఇది తట్టుకోలేని ప్రియుడు ఆమె ముందే నిప్పంటించుకున్నాడు.
ఆ ఇద్దరికీ పెళ్లేంది. వేర్వేరుగా ముగ్గురు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె ఏవో గొడవలతో భర్తకు దూరంగా ఉంటుంది. మెల్లగా అతను ఆమెకు దగ్గరయ్యాడు. కబుర్లు చెప్పి.. తనవైపు తిప్పుకున్నాడు. ఆమె కూడా అతని మాటలు నమ్మి... ఇన్ని రోజులు కలిసే ఉంది. ఇటీవలే భర్త పిలవగానే.. వెళ్లిపోయింది. అది తట్టుకోలేని ప్రియుడు... పెట్రోల్ పోసుకొని ఆమె ఇంటి ముందే నిప్పంటించుకున్నాడు.
నాగోల్ కు చెందిన సురేశ్.. హిమాయత్ నగర్లోని జిరాక్స్ సెంటర్లో పని చేస్తున్నాడు. అక్కడే మరో కంపెనీలో యాదవ గల్లీకి చెందిన మహిళ పని చేస్తోంది. ఆమె కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సురేశ్ కూడా పెళ్లైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు దగ్గరలోనే పని చేస్తుండటంతో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ.. దగ్గరయ్యారు. కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏడు నెలలు ఒకే రూమ్ లో కలిసే ఉన్నారు. ప్రియురాలి కోసం భార్యతో సురేశ్ తరచూ గొడవపడేవాడు. ఇంటికి వెళ్లేవాడు కాదు. ఇదిలా జరగుతుండగానే.. ఇటీవల తన భర్త దగ్గరకు వెళ్లిపోయింది ఆ మహిళ. ఈ విషయాన్ని సురేశ్ జీర్ణించుకోలేక పోయాడు. అతిగా ఆలోచించాడు. ఆమె లేకుండా ఉండలేను అనే స్థితిలోకి వెళ్లాడు.
ఆమెకు ఫోన్లు చేసి విసిగించాడు. నాలుగు రోజులుగా ఫోన్ చేస్తుంటే ఆమె అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా ఉన్నా.. దయచేసి ఫోన్ చేయకు.. మన సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దాం.. అని ఆమె చెప్పింది. ఈ మాటలు విన్న సురేశ్ మనస్తాపానికి గురయ్యాడు. ఇద్దరం ప్రేమించుకున్నాం.. కొంతకాలం కలిసి ఉన్నాం, ఒక్కసారిగా ఇప్పుడు కాదంటోందని.. తీవ్రంగా ఆలోచించాడు.
శనివారం రాత్రి మద్యం అతిగా తాగి.. ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఇది పద్ధతి కాదని.. చెప్పి స్థానికులు పంపించారు. ఆదివార తెల్లవారుజామునే మళ్లీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మళ్లీ తలపు తట్టాడు. ఆమె చూస్తుండగానే.. ప్రెట్రోల్ సీసా తీశాడు. నీ కోసం చచ్చిపోతానంటూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటికుని.. తీవ్రగాయలపాలయ్యాడు.
విషయం తెలిసిన నారాయణగూడ పోలీసులు.. సురేశ్ ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. హస్పిటల్ లో అతడికి కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సురేశ్ భార్యకు చేరవేశారు పోలీసులు. మెుదట రాను అని చెప్పినా... తర్వాత పోలీసుల మాట మీద గౌరవంతో వచ్చి భర్తకు సేవలు చేసింది. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం చనిపోయాడు సురేశ్.