అన్వేషించండి

Hyderabad News: సెల్‌ఫోన్‌లో క్యాసినో ఆట, 92 లక్షలు గోవిందా! ఆ డబ్బులు ఎక్కడివో తెలిస్తే షాక్!

Hyderabad Crime News: ఫోన్ లో క్యాసినో గేమ్ ఆడుతూ.. ప్రభుత్వం భూసేకరణ కింద ఇచ్చిన 92 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేశాడు.

Hyderabad News: సెల్ ఫోన్ లో క్యాసినో ఆడే కుర్రాడు చేసిన పని తెలిస్తే అంతా ముక్కున వేలేస్కోవాల్సిందే. భూసేకరణ కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బును క్యాసినో గేమ్ ఆడుతూ పోగొట్టుకున్నాడు. వందలు వేళల్లో కాదండోయ్... ఏకంగా 92 లక్షల రూపాయలను స్వాహా చేసేశాడు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని అలసత్వంగా చేసుకొని కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

భూసేకరణ కింద 1.05 కోట్లు..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చన్ వళ్లి శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు.  పెద్ద కుమారుడు శ్రీపాల్ రెడ్డి హైదరాబాద్ లో బీటెక్ చదువుతుండగా, 19 ఏళ్ల చిన్న కుమారుడు నిజాం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డికి ఉన్న పదెకరాల భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు.  ఇటీవల ప్రభుత్వం టీఎస్ఐఐసీకీ ఆ భూములను అప్పగించింది. భూసేకరణ కింద ఎకరాకు రూ.10.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి దాదాపు రూ.1.05 కోట్లు వచ్చింది. ఈ డబ్బుతో శ్రీనివాస్ రెడ్డి శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అర ఎకరా భూమిని కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షలకు ఒకరితో బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా 20 లక్షల రూపాయలను చెల్లించారు. 

ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి డబ్బులు తీసుకున్న కుమారుడు

మిగిలిన 85 లక్షల రూపాయలను తన పేరిట, తన భార్య పేరిట రూ.42.5 లక్షల చొప్పున జమ చేశారు. అప్పటికే వారి చిన్న కుమారుడు హర్ష వర్ధన్ రెడ్డి ఫోన్ లో కింగ్ 567 క్యాసినో పేరుతో ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు.  పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానని చెప్పి తండ్రి దగ్గర నుంచి రూ.42.5 లక్షలను తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. తల్లి విజయలక్ష్మికి కూడా ఇదే విషయం చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలోని రూ. 42.5 లక్షలను విత్ డ్రా చేసి ఇచ్చింది. అయితే హర్ష వర్ధన్ ఈ డబ్బును యజమానికి ఇవ్వకుండా... ఆన్ లైన్ గేము లు ఆడేందుకు ఉపయోగించాడు. 

గ్రామస్థుడి వద్ద రూ.7 లక్షల అప్పు

దఫదఫాలుగా ఆన్ లైన్ లో గేమ్ ఆడుతూ.. 42.5 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆపై తల్లి ఖాతాలో ఉన్న ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉంచిన సొమ్మును తన అకౌంట్ లో పలుమార్లు డిపాజిట్ చేసుకొని ఆటలో కోల్పోయాడు. డబ్బు గురించిన గట్టిగా నిలదీసి అడగేసిరికి ఆన్ లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ. 7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ.7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రూ.92 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత డబ్బు పోవడంతో ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డబ్బు పోగొట్టినందుకు కన్న కొడుకును ఏమైనా అంటే ఏం చేసుకుంటాడో అని వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
Embed widget