By: ABP Desam | Updated at : 25 Feb 2023 03:34 PM (IST)
Edited By: jyothi
ప్రేమికురాలితో క్లోజ్ గా ఉంటున్నాడని స్నేహితుడిని చంపిన వ్యక్తి, ఏమైందంటే?
Hyderabad Crime News: వారిద్దరూ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే వీరిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. అదే వీరి మధ్య గొడవకు దారి తీసింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో స్నేహితుడు క్లోజ్ అవుతున్నాడని, అతడికి దగ్గరై తన ప్రేమను ఎక్కడ కాదంటుందోనన్న భయంతో.. స్నేహితుడినే చంపేశాడో యువకుడు. ఆపై గుండెను, ఓ వేలును నరికేసి ఫొటో తీశాడు. వాటిని అమ్మాయికి పంపి.. ఈ వేలే కదా నిన్ను తాకింది, ఈ పెదాలే కదా నిన్ను ఆనింది, ఈ గుండే కదా నిన్ను ప్రేమించిందంటూ మెసేజ్ పెట్టాడు. చివరకు తలను కోసి దూరంగా పడేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
అసలేం జరిగిందంటే..?
నల్గొండ జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీలో నవీన్, హరిహర కృష్ణలు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఈఈఈ కావడంతో వారిద్దరికీ మంచి స్నేహం ఉంది. అయితే వీరిద్దరూ ఒకే అమ్మాయిపై మనసు పారేసుకున్నారు. ఇదే ఇందులో ఒకరి చావుకు కారణం అయింది. అమ్మాయిని ఇద్దరూ ప్రేమిస్తున్న విషయం తెలుసుకొని చాలా సార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే సదరు అమ్మాయి నవీన్ తో క్లోజ్ అయింది. అది చూసి తట్టుకోలేకపోయిన హరి తన స్నేహితుడిపై కోపాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడి ప్రేమలో పడిపోతుందోనని చాలా భయపడిపోయాడు. ఈ క్రమంలోనే అలా జరగడానికి వీళ్లేదనుకొని అద్భుతమైన ప్లాన్ వేశాడు. నవీన్ ను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 17వ తేదీన పార్టీ చేసుకుందాం రమ్మని అబ్ధుల్లాపూర్ మెట్ లోని తన ఫ్రెండ్ రూంకి నవీన్ ను పిలిచాడు.
స్నేహితుడే కదా పిలచింది అని వచ్చిన నవీన్.. వారితో కలిసి మద్యం తాగాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ విషయాన్ని వెంటనే నవీన్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో నవీన్ తండ్రి శంకరయ్య హరితో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశాడు. అయితే అదే రోజు నుంచి నవీన్ కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. అయితే విషయం గుర్తించిన నవీన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రోజే నవీన్ ఫేన్ చేసి హరితో గొడవ పడ్డట్లు చెప్పాడని.. శంకరయ్య పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఎంజీయూలో విద్యార్థులు, హరి స్నేహితులను విచారించారు. ఈనెల 22వ తేదీ సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు గుర్తిచారు. ఆపై హరి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. దీంతో హరి శుక్రవారం రోజు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తన ప్రియురాలిని నవీన్ ఎక్కడ దక్కించుకుంటాడో అన్న అసూయతోనే విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని ఒప్పుకున్నాడు.
నవీన్ ను హత్యే చేసిన తర్వాత హరి.. ఆ విషయాన్ని తాను ప్రేమిస్తున్న అమ్మాయికి వాట్సాప్ ద్వారా తెలిపాడు. అంతేకాకుండా నవీన్ వేలును, పెదాలను, గుండెను కోసి బయటకు తీశాడు. వాటిని ఫొటోలుగా తీసి... ఈ వేలే కదా నిన్ను తాకింది, ఈ పెదాలే కదా నిన్ను కోరింది , ఈ గుండెనే కదా నిన్ను ప్రేమించిందంటూ ఫొటోల కింద రాస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పెట్టాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఇవన్నీ చదివిన అమ్మాయి జోక్ అనుకుందో లేక ఏమనుకుందో తెలియదు గానీ... అవునా.. ఓకే, వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ హత్య కేసులో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు.
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
TSPSC Paper Leak: "టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలి"
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్