Joginapally Santosh Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్ - జోగినపల్లి సంతోష్ కుమార్‌పై కేసు నమోదు, ఎందుకంటే!
BRS Leader Santosh Kumar: భూమి కబ్జా చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Banjarahills Police Filed case on Santosh Kumar: హైదరాబాద్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చిక్కుల్లో పడ్డారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14 లో ఓ భూ వివాదానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో సంతోష్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంతోష్ రావుపై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదు
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న భూమిని కబ్జా చేయాలని సంతోష్ రావు యత్నించారని నవయుగ కంపెనీ ఆరోపిస్తోంది. నకిలీ డాక్యుమెంట్స్ (Fake Documents), ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి తమకు సంబంధించిన భూమిని ఆక్రమించాలని యత్నిస్తున్నారని కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో NECL కంపెనీ కు చెందిన భూమిలో సంతోష్ రావు అక్రమంగా రూములు నిర్మించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని తన ఫిర్యాదులో చింతా మాధవ్ పేర్కొన్నారు. NECL కంపెనీకి చెందిన భూమిలో సంతోష్ రావు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయంపై బాధితులు మార్చి 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేత సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ రావుపై ఐపీసీ 420, 468, 471, 447, 120, r/w 34 IPC కింద కేస్ నమోదు చేశారు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















