News
News
X

Hyderabad: పెళ్లి తర్వాత శోభనానికి ఏర్పాట్లు.. ఇప్పుడే వస్తానన్న వధువు, వెళ్లి చూసి వరుడు షాక్

పెళ్లి జరిగిన నిమిషాల వ్యవధిలోనే పెళ్లి కూతురు మాయమైంది. ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయినట్లుగా అంతా అనుమానిస్తున్నారు.

FOLLOW US: 

పెళ్లి సంబంధాలు కుదుర్చుకొనే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చాటే ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సంబంధాలు మాట్లాడుకొనేటప్పుడు ఎదుటి వారి గురించి సరిగ్గా విచారణ చేసుకోకపోతే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని పెళ్లికి వచ్చిన అతిథులు చర్చించుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఓ పెళ్లిలో ఈ వింతైన ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 

పెళ్లి జరిగిన నిమిషాల వ్యవధిలోనే పెళ్లి కూతురు మాయమైంది. ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయినట్లుగా అంతా అనుమానిస్తున్నారు. వివాహం జరిగిన అర గంటలోనే పెళ్లి కూతురు అదృశ్యమైందని అతిథులు వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువతి తల్లిదండ్రులు బెంగళూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ పాత బస్తీలోని నబీల్‌ కాలనీలో ఓ ఇంట్లో పెద్దలు వీరు ఇద్దరికీ వివాహం జరిపించారు. అబ్బాయి తరఫు వారు పెళ్లి కూతురికి కానుకల కింద దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు పెళ్లిలో ఇచ్చారు. పెళ్లి మొత్తం ఘనంగా జరిగింది.

ఈ వివాహ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత శోభనం కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. పెళ్లి కూతురు ఓ పట్టుబట్టింది. తాను అర్జంటుగా బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని, అక్కడ ముస్తాబై వస్తానని అడిగింది. పెళ్లి జరిగిన వెంటనే బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం ఏంటని పెద్దలు వారించి ఆమెను ఇంట్లోనే ఉంచేశారు. ఆమె ససేమిరా అంటూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిందేనని మొండికేసి కూర్చుంది. ఇక చేసేది లేక ఆమెను బ్యూటీ పార్లర్‌కు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కూతురి కోసం దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి చూశారు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, పెళ్లి కుమారుడి తరపు వారు కంగుతిన్నారు.

అయితే, ఆమె తన ప్రియుడితో పారిపోయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

Also Read: Amarinder Vs Navjot: సీఎంగా సిద్దూ దేశానికే ప్రమాదం, ఎందుకంటే.. అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

Also Read: TRS News: విమోచన దినం విషాదం.. తెలంగాణకు జూన్ 2 ఉందిగా.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

Published at : 18 Sep 2021 10:35 PM (IST) Tags: Hyderabad News old city bride groom news bride groom went away old city marriage

సంబంధిత కథనాలు

వెయ్యి కిలోమీటర్లు దాటిన

వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

టాప్ స్టోరీస్

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !