అన్వేషించండి

Hyderabad: బైక్‌ నడుపుతూనే యువకుడి లైంగిక దాడి! చావుబతుకుల మధ్య యువతి

లైంగిక దాడి గమనించి తప్పించుకొనే క్రమంలో యువతి కింద పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

హైదరాబాద్‌లో ఓ ఆకతాయి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది కూడా బైక్ పై ఉండగా, యువతిని తానే బైక్ ఎక్కించుకొని, నడుపుతూనే లైంగిక దాడి చేశాడు. నగరంలోని తార్నాకలో ఈ ఘటన జరిగింది. లైంగిక దాడి గమనించి యువతి బైక్ దిగే క్రమంలో కింద పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే, ఈ ఘటన కొద్ది వారాల క్రితం అర్ధరాత్రి 11 గంటల సమయంలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని తార్నాకలో నివాసం ఉంటున్న ఆర్తి అనే యువతి పాల డబ్బా తేవడం కోసం బయటికి వెళ్లింది. దగ్గర్లోని షాపు మూసేసి ఉండడం వల్ల ఆమె దూరం వెళ్లాల్సి వచ్చింది. ఆటో కోసం రోడ్డు మీద ఎదురుచూస్తూ ఉండగా, ఇంతలో ఓ యువకుడు బైక్‌పై అటుగా వచ్చాడు. దగ్గర్లోని మెడికల్ షాప్ గురించి అతణ్ని ఆరా తీయగా, కొంచెం ముందుకెళ్తే ఉందని చెప్పాడు. కావాలంటే అక్కడిదాకా లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్‌ ఎక్కించుకున్నాడు. అతడ్ని నమ్మి యువతి బైక్ ఎక్కింది.

కొంచెం దూరం వెళ్లాక స్థానిక సల్మాన్ అనే హోటల్ దగ్గర యువతిపై చేతులు వేస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. తన రూంకి రావాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె భయపడిపోయి తప్పించుకునే ప్రయత్నం చేయగా, బైక్‌ పైనుంచి రోడ్డుపైకి దూకేసింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఆమె మీదుగా నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అరుపులు వేయడంతో విషయం గమనించిన స్థానికులు వెంటనే ఆర్తిని గాంధీ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇంకా యువతి స్పృహలోకి రాలేదని చెప్పారు. ఆర్తి తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులు, ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లను బతిమాలారు. ఇంకా యువతి స్పృహలో లేకపోవడంతో ఎలాంటి వివరాలు తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉస్మానియా వర్సిటీ ఏరియా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget