అన్వేషించండి

రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్ట్

ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు కూడా పూర్తి కాలేదు. అపుడే సొంత పార్టీలో విభేదాలు వచ్చాయా ? మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పోస్టు పెట్టారన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Minister Komatireddy Poster Vivadam : తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం (Government) ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy ) బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka), మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) బాధ్యతలు స్వీకరించారు. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు విద్యుత్ శాఖ దక్కాయి. ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖతోపాటు సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి. ప్రభుత్వం ఏర్పాటయి నెలరోజులు కూడా పూర్తి కాలేదు. అపుడే సొంత పార్టీలో విభేదాలు వచ్చాయా ?  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు ఎక్స్ వేదికగా ఆ పోస్టు పెట్టారన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే...భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఒకే పార్టీ నాయకులు కావడంతో ఫోటో పోస్టు చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇద్దరు నేతలు నవ్వుతూ...దాని వెనుక పెట్టిన క్యాప్షన్ పై దుమారం మొదలైంది. ఒకర్ని ఒకరు చూసుకుంటున్న ఈ పోస్టర్ లో కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం టైటిల్ పెట్టారు. అందులోనూ కొత్తశకం అన్నదాన్ని హైలైట్ చేశారు. దీనిపైనే ఆసక్తికరంగా జరుగుతోంది. 

ఇద్దరు కలిసి నడవడం ఏంటి ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోను పెట్టి...ఈ క్యాప్షన్ పెడితే సరిపోయిందని కొందరు అంటున్నారు. అలా కాకుండా ఉపముఖ్యమంత్రితో ఉన్న ఫోటోకు క్యాప్షన్ పెట్టడంపై దుమారం మొదలైంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెరవెనుక ఏమైనా నడిపిస్తున్నారా ? అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే నేతల మధ్య లుకలుకలు షురూ అయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కామన్ అని కూడా అంటున్నారు. ఏమీ లేకపోతే ఇద్దరు నేతలు...సందర్బం లేకుండా ఎందుకు ఫోటో పెట్టారు ? కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం టైటిల్ ఒక్కటే కాదు...నేతల బ్యాక్ గ్రౌండ్ లో తెలంగాణ ప్రభుత్వం సింబల్, కొత్త సెక్రటేరియట్ భవనాన్ని కూడా పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చ  మొదలైంది. నిప్పు లేకుండా పొగ రాదు కదా అని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై అటు భట్టి విక్రమార్క, ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

Also Read: ఫ్రీ బస్ ఎఫెక్ట్ - మహిళలతో నిండుతున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తోన్న పురుషులు

Also Read: హైదరాబాద్‌లో 30 శాతం ఆదాయం ఇంటి ఈఎంఐకే - భాగ్యనగరంలో జాగా కొనాలంటే చుక్కలే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Embed widget