అన్వేషించండి

Hit and Run Case: రంగారెడ్డి జిల్లాలో హిట్ అండ్ రన్.. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతు మృతి

Rangareddy Crime News | రంగారెడ్డి జిల్లాలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతును ఆటో ఢీకొట్టడంతో మృతిచెందాడు.

Rangareddy Hit and Run Case |  హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్దార్ నగర్ ప్రాంతంలో అంబోజి యాదయ్య అనే రైతు హిట్ అండ్ రన్ (Hit and Run) ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. రోజూలాగే తన పొలం పనులను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో, వేగంగా వచ్చిన ఒక ఆటో యాదయ్యను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రైతు యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆ రైతు మృతి చెందాడు. కష్టపడి పనిచేసే రైతు ఇలా అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడంతో సర్దార్ నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రైతు యాదయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Hit and Run Case: రంగారెడ్డి జిల్లాలో హిట్ అండ్ రన్.. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతు మృతి

కేసు నమోదు చేసిన పోలీసులు

ఘటనపై సమాచారం అందుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


Hit and Run Case: రంగారెడ్డి జిల్లాలో హిట్ అండ్ రన్.. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతు మృతి

రోడ్డు దాటే సమయంలో, రోడ్డు వెంట నడిచే సమయంలో పాదచారులు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అదే విధంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం అని, వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని.. కొన్ని సందర్భాలలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget