అన్వేషించండి

టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు

టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

Tspsc Board Recruitment : టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై తెలంగాణ ( Telangana) ప్రభుత్వం (Government) కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  ఛైర్మన్‌ (Chairman)తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ముఖ్యమంత్రి (Cm)రేవంత్ రెడ్డి (Revanth Reddy)భావిస్తున్నారు. బోర్డు నియామకంపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం... కొందరు బ్యూరోక్రాట్ల పేర్లతో పాటు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బోర్డును వీలయినంత త్వరగా నియామించాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బోర్డు ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించింది. నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా...పరీక్షలు నిర్వహించాలంటే బోర్డే కీలకం. అందుకే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు నియామకంపై సీనియస్ గా కసరత్తు చేస్తోంది.  గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

గత ప్రభుత్వ హయాంలో లీకులే లీకులు

గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శల పాలయింది. పరీక్షపేపర్ లీకులో బోర్డులో పని చేసే ఉద్యోగులే ఉండటం రాజకీయ దుమారం రేపింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్‌ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్‌తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. బోర్డులో కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పోస్టు కూడా ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. గతంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ గా పని చేసిన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌...జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.

ప్రక్షాళన చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి

కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాత పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించనుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశంద ఉంది. యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. కొత్త బోర్డు నియమించిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రూప్‌-2 పరీక్షలతో  ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించనుంది.

Also Read:ప్రజాపాలన పేరుతో మెసేజ్‌, కాల్ వచ్చిందా!

Also Read: ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ - షెడ్యూల్ ఇదే

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget