అన్వేషించండి

Raja Singh CommentsL ఓవైసీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారింది.. సీఎం గారూ చర్యలు తీసుకోండి: రాజాసింగ్ హెచ్చరిక

Raja Singh on Terror Attack: ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర దాడికి తెలంగాణ కనెక్షన్ ఉండటం ఇక్కడ కలకలం రేపుతోంది.హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయిందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర దాడికి తెలంగాణ కనెక్షన్ ఉండటం ఇక్కడ కలకలం రేపుతోంది.హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయిందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

Raja Singh Comments: ఆస్ట్రేలియా సిడ్నీలోని ఉగ్రవాద కాల్పుల ఘటనకు హైదరాబాద్ కనెక్షన్ ఉండటం కలకలం రేపడమే రాజకీయంగానూ అలజడి రగిలిస్తోంది. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ నేత టి.రాజాసింగ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదం విషయంలో కఠినంగా వ్యవహరించకుండా బుజ్జగింపు రాజకీయాలు చేసుకుంటూ వెళితే ఇక్కడ కూడా భారీ ముూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సిడ్నీలోని బాండి బీచ్ వద్ద హనుక్కా వేడుకల సమయంలో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉగ్రవాదుల అడ్డాగా ఓవైసీ గడ్డ- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన వ్యక్తి సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ కలిసి ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయగా, దీనిపై రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. “ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని వెనుక మూలాలు హైదరాబాద్‌తోనే ముడిపడుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది” అంటూ రాజాసింగ్ నేరుగా ఆరోపణలు చేశారు. "దేశంలో ఎక్కడ అలజడి రేగినా దానికి మూలాలు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో కనిపిస్తాయి. టోలీచౌకీలో ఒకప్పుడు నివసించిన వ్యక్తి ఇప్పుడు విదేశాల్లో ఉగ్రదాడి చేశారు.  టోలీచౌకి ఓవైసీ పార్లమెంట్‌ స్థానం" అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు 

ఓవైసీతో దోస్తీ మంచిది కాదు- రేవంత్‌కు హెచ్చరిక

ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడిని తేలకగా తీసుకోవద్దని రాజాసింగ్ సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. టోలీచౌకి వ్యక్తికి సంబంధం ఉన్నందున అతని బంధువులను విచారణ చేయాలని సూచించారు.'ఓటుబ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు చేస్తే తెలంగాణ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని' హెచ్చరించారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ నిఘాను బలపరచాలని సూచించారు.  "ఓవైసీతో దోస్తీ ఇవాళ కాకపోతే రేపైనా చేటు చేస్తుంది. దానిని వదిలేయండి. టెర్రరిస్టులతో ఓవైసీకి ఉన్న లింక్ ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంద"ని సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget