అన్వేషించండి

Chutneys Blast: చట్సీస్ రెస్టారెంట్‌లో పేలుడు - కానీ అందరూ భయపడినది కాదు !

LB Nagar Chutneys: హైదరాబాద్‌లోని బిజీ ప్రాంతమైన ఎల్బీనగర్‌లో ఉన్న చట్నీస్ హోటల్‌లో హఠాత్తుగా పేలుడు సంభవించంది. దీంతో కస్టమర్లు అంతా భయపడ్డారు.

Explosion at LB Nagar Chutneys restaurant:  ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సమీపంలోని చట్నీస్ హోటల్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గతంలో బెంగళూరు రామేశ్వరం హోటల్ లో ఇలాగే పేలుడు సంభవించిన ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉండటంతో  అలాంటిదేమైనా జరిగిందేమో అని అందరూ కంగారు పడ్డారు. అయితే  కాసేపటికి అలాంటిదేమీ లేదని తేలింది. హోటల్ వంటగదిలో ఇడ్లీలు తయారు చేసే ఇడ్లీ స్టీమర్ లో ప్రెజర్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అది భారీ శబ్దంతో పేలిపోయినట్లుగా గుర్తించారు. ఈ పేలుడు ధాటికి హోటల్‌లో ఉన్న కస్టమర్లు బాంబు పేలిందేమోనన్న భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. హోటల్ లోపల సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ  గందరగోళంగా ఏర్పడింది. 

ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు – ఆస్పత్రికి తరలింపు 
 
ఈ ప్రమాద సమయంలో వంటగదిలో పని చేస్తున్న ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీమర్ పేలిన వేగానికి , వేడి నీటి ఆవిరి వల్ల వారి శరీరాలు కాలినట్లు సమాచారం. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం  

ప్రమాదం జరిగిన వెంటనే చట్నీస్ యాజమాన్యం బయటి వ్యక్తులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హోటల్ షట్టర్లు దించి, జరిగిన విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని స్థానికులు మండిపడుతున్నారు. కస్టమర్ల భద్రత కంటే హోటల్ ప్రతిష్టకే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 విచారణ ప్రారంభం                
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, సాక్ష్యాలను సేకరించారు. స్టీమర్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
Embed widget