ముస్లింలకు ప్రముఖుల రంజాన్ శుభాకాంక్షలు- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు జరుగుతున్నాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
రంజాన్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనల్లో భారీ సంఖ్యలో ముస్లిం పాల్గొంటున్నారు. పండగ వేళలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్, మాసబ్ ట్యాంక్, సింకిద్రాంబాద్, రాణిగంజ్ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు జరుగుతున్నాయి.
#WATCH | People offered namaz at Gandhi Maidan in Patna, Bihar on the occasion of #EidUlFitr. CM Nitish Kumar also visited the ground. pic.twitter.com/0dgs9Rx8Ni
— ANI (@ANI) April 22, 2023
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ మన సమాజంలో సామరస్యం, కరుణ స్ఫూర్తి మరింత పెరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
अक्षय तृतीया की बहुत-बहुत बधाई। मेरी कामना है कि दान-पुण्य और मांगलिक कार्य के शुभारंभ की परंपरा से जुड़ा यह पावन पर्व हर किसी के जीवन में सुख, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) April 22, 2023
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రార్థనలు చేశారు. ఇటుకను అందించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్ ముబారక్, ఈ పవిత్రమైన పండుగ అందరికీ శాంతి, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలి.
Eid Mubarak to everyone! May this auspicious festival bring peace, happiness & prosperity to all. pic.twitter.com/qLXF8lVX0G
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2023
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా, నేను తోటి పౌరులందరికీ, ముఖ్యంగా భారతదేశం, విదేశాల్లోని ముస్లిం సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ, కరుణ పండుగ అయిన ఈద్, ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సమాజంలో సోదరభావం, పరస్పర సామరస్యాన్ని పెంపొందించే మార్గంలో ముందుకు సాగాలని మనమందరం సంకల్పిద్దాం.
ईद-उल-फ़ित्र पर सभी देशवासियों विशेष रूप से मुस्लिम भाइयों-बहनों को मैं बधाई देती हूं। प्रेम और करुणा का पर्व ईद हमें दूसरों की मदद करने का संदेश देता है। आइए, जश्न के इस मुबारक मौके पर हम सभी समाज में भाईचारा और आपसी सौहार्द को बढ़ाने की राह पर आगे बढ़ने का संकल्प लें।
— President of India (@rashtrapatibhvn) April 22, 2023
ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజాన్ని తీర్చిదిద్దాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతోందన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023