అన్వేషించండి

KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Comments: కేటీఆర్ చిట్ చాట్‌లో ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని అన్నారు. అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.

Telangana News: రుణమాఫీ పైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని.. గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతామని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని అన్నారు. విలేకరులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.

‘‘ఆరు గ్యారంటీల అమలు పైన కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పింది నిజం. రైతుల ఖాతాలకు రూ. 7500 కోట్లు మాత్రమే చేరినయ్. అమలు అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్ లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు రెండు విడతల్లో రూ. 7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 

రాష్ట్రం అప్పుల పైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది. జీతభత్యాలు లాంటి కచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్ గా ఉంది. 2014 లో 300 కోట్లు రెవెన్యూ సర్ ప్లేస్ ఉంటే 2023 లో రూ. 5900 కోట్లు సర్ ప్లేస్ గా వారికి ఇచ్చాం. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ పైన అబద్దాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆగస్టు 15లోగా ఎలాగు రుణమాఫీ చేయలేదు.  కనీసం ఎప్పటిలోగా చేస్తారో అదైనా ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు భరోసాను ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి. 

రాహుల్ గాంధీకి, రేవంత్‌కు విభేదాలు
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి  రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు మా మెడ మీద కత్తిపెట్టినా సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలి. 

తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక. అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి  ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ రెడ్డి తన పార్టీ నాయకుల దగ్గర మార్కులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం అంజయ్య పార్క్ ముందు పెట్టడంలో అంతర్యం ఏమిటి? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది.

మీ 8 మంది ఎంపీలు గాడిదలు కాస్తారా?
కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే....మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును కచ్చితంగా మారుస్తాం. 9 నెలలలో రేవంత్ రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయిరావడం. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇతర ప్రాంత వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీని పంపారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పదవులను తెలంగాణేతరులకు అప్పజెప్పుతుంది. అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపికైనా ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మను సింఘ్వీ కి ఇచ్చారు’’ అని కేటీఆర్ అన్నారు

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget