తెలంగాణలోనే కాదు ఢిల్లీలో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం- అమిత్‌షా అరెస్టుకు సిసోడియా డిమాండ్
తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడారు. ఎప్పటి నుంచో ఇదే విషయం తాము చెబుతున్నామని అన్నారు.
Manish Sisodia On BJP: తెలంగాణలో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారం హస్తినకు తాకింది. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూడా అస్తిర పరిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మనీష్ సిసోడియా ఆరోపించారు. ఈ కేసులో హోం మంత్రి అమిత్ షా పేరును ప్రస్తావిస్తూ... వీటన్నింటిలో ఆయన ప్రమేయం ఉంటే వెంటనే అరెస్టు చేయాలని ఆయన అన్నారు.
ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కోసం రూ .1075 కోట్లు ఉంచినట్లు మనీష్ సిసోడియా తెలిపారు. అంత డబ్బు బీజేపీ వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడ నుంచి అంత డబ్బు పొందారు? వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనిపై విచారణ జరిపించాలన్నారు.
అమిత్‌షాను అరెస్టు చేయాలి: మనీష్ సిసోడియా
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "బిజెపి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని మేము గతంలో చెప్పాము. నన్ను కూడా ఆఫర్ చేయడానికి ప్రయత్నించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఆడియోలో సంతోష్ జీ, షా జీ పేర్లు పదే పదే ప్రస్తావనకు వచ్చాయి. ఇంతకీ ఆయన ఎవరు? అది అమిత్ షా అయితే, దేశ హోం మంత్రి ఈ విధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పెద్ద ప్రమాదమే. ఈడీ-సీబీఐ విచారణ జరగాలి.
दिल्ली में 43 MLAs को तोड़ने की कोशिश कर रही है भाजपा. तेलंगाना में MLA ख़रीदने की कोशिश में ₹100 करोड़ के साथ पकड़े गए इनके दलाल ने खुद क़बूला है कि इसी तरह 25-25 करोड़ में दिल्ली के MLA ख़रीदने के लिए पैसा रखा हुआ है.
— Manish Sisodia (@msisodia) October 29, 2022
कहाँ से आ रहा है 43 MLA ख़रीदने के लिए 1075 करोड़ रुपया? https://t.co/k7OGHWuDXn
ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ నడుపుతోంది: మనీష్ సిసోడియా
గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ ఆడియో బయటకు వచ్చిందని సిసోడియా తెలిపారు. డబ్బు, పదవులు ఇవ్వడం గురించి చర్చ జరిగిందన్నారు. ఇప్పుడు మరో కొత్త ఆడియో టేప్ వెలుగు చూసిందన్నారు. ఇందులో బిఎల్ సంతోష్‌తో మీటింగ్‌పై చర్చ జరిగింది. బీజేపీ తరఫున మాట్టాడే వ్యక్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం గురించి మాట్లాడారన్నారు. ఇలా ఢిల్లీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కూడా నడుస్తోందన్నారు.
Addressing an Important Press Conference | LIVE https://t.co/1R9Fhif0cc
— Manish Sisodia (@msisodia) October 29, 2022