ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ గుర్తుపై పోటీ చేయడంతో హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది.
Khairatabad Assembly Seat: దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.

- ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు; దానం నాగేందర్‌పై అనర్హత వేటు.
- దానం అనర్హత తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో సీటు ఖాళీ.
- బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ నుండి పోటీచేయడంతో అనర్హుడయ్యాడు.
- ఎమ్మెల్యేగా ఏప్రిల్ 23, 2024 నుండి దానం అనర్హత చెందారు.
Danam Nagender Disqualification | హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందని ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 26నే అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి ఖైరతాబాద్ స్థానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల హైకోర్టు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడం తెలిసిందే. 2024 ఏప్రిల్ నుంచి దానం ఎమ్మెల్యేగా అనర్హుడిగా హైకోర్టు స్పష్టం చేయగా, సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీ గుర్తుపై పోటీచేయడంతో అనర్హత వేటు వేసినట్లు కోర్టులు తమ తీర్పులో స్పష్టం చేశాయి.

దానం ఎమ్మెల్యేగా అనర్హుడు.. ఇటీవల హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న దానంను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిరాయింపు పిటిషన్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అని తీర్పు వెలువరించింది.
బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఆయన కాంగ్రెస్ నుంచి బీఫారం పొంది పోటీ చేసినట్లు గుర్తించింది. దాంతో 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని స్పష్టం చేసింది. తాజాగా అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లోని ఆర్టికల్ 191(2) లోని పేరాగ్రాఫ్ 2 (1)(a) కింద దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడిగా పేర్కొంటూ హైకోర్టు సెప్టెంబర్ 18న తీర్పిచ్చింది.
Frequently Asked Questions
దానం నాగేందర్ ఎందుకు అనర్హుడు అయ్యారు?
దానం నాగేందర్ అనర్హత వల్ల ఏం జరిగింది?
ఆయన అనర్హుడు కావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి.
ఖైరతాబాద్ స్థానం ఎప్పుడు ఖాళీగా ప్రకటించబడింది?
సెప్టెంబర్ 26న అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి ఖైరతాబాద్ స్థానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 2024 నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
దానం నాగేందర్‌ను ఏ కోర్టు అనర్హుడిగా ప్రకటించింది?
తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది.
ట్రెండింగ్ వార్తలు























