CM Revanth Reddy: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం, ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం
Revanth Reddy News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన దృష్టి సారించారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి, తొలిసారి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారు.
Collector and Superintendent of police Meeting with Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి (Cm )రేవంత్ రెడ్డి (Cm Revanth reddy ) పాలన దృష్టి సారించారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి, తొలిసారి జిల్లాల కలెక్టర్లు (Collectors), ఎస్పీ (superintendent of police)లతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసేలా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసేలా జిల్లాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పకడ్బందీగా నిర్వహించడంపై కలెక్టర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.