ఎలాంటి ప్రైవేటీకరణ ఆలోచన లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీచర్లు, లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు ఎలాంటి సమస్య ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
Polytechnic Lateral Entry: బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ విధానం యథాతథం.. పాలిటెక్నిక్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
Polytechnic Lateral Entry Engineering Admissions | ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ ప్రవేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి సమస్య లేదని సీఎం హామీ ఇచ్చారు.
కొడంగల్: తెలంగాణలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం కల్పించే (లాటరల్ ఎంట్రీ) విధానం యథాతథంగా కొనసాగుతుందని తెలంగాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఈ విధానాన్ని రద్దు చేస్తామంటూ చెబుతున్నామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పిల్లల భవిష్యత్తును దెబ్బతీయడానికి తాను విద్యాశాఖ మంత్రిగా లేనని పేర్కొన్న ఆయన, యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ (ఎలా ఉందో అలాగే) పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ప్రవేశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో పరిమిత ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు వందల్లో ర్యాంక్ వస్తే తప్ప సీటు దక్కేది కాదు. కానీ నేడు 5 లక్షల ర్యాంక్ వచ్చినా సీటు లభిస్తోందని, కాబట్టి విద్యార్థులు ఎలాంటి అపోహలతో అమాయకంగా మోసపోవద్దని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు - ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలోని విద్యా విధానంలో సమూలమైన మార్పులు, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకే పరిమితం కాకుండా జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థులు చదువుకున్నప్పుడే వారికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
సమస్యల పరిష్కారానికి కమిటీ నియామకం
కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఆలోచనలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారని, వారి ట్రాప్‌లలో పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను కోరారు. పాలిటెక్నిక్ కాలేజీల సమస్యల పరిష్కారం కోసం కేశవరావు నేతృత్వంలో, ఎమ్మెల్సీ కోదండరామ్‌తో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించామన్నారు. విద్యార్థులు ఆ కమిటీ సభ్యులతో కూర్చుని మాట్లాడి, తమ సమస్యలపై సలహాలు ఇవ్వవచ్చని ఈ సందర్భంగా సూచించారు. ఎలాంటి ప్రైవేటీకరణ ఆలోచన లేదని, టీచర్లు, లెక్చరర్ల సర్వీస్ రూల్స్ వేరని పేర్కొంటూ వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి సమస్య లేదని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ‘సేవ్ పాలిటెక్నిక్ – సేవ్ అవర్ ఫ్యూచర్’ అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నియామకాలు, డీఎస్సీ ప్రక్రియ వేగవంతం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల తీరుతో పోలిస్తే తమ హయాంలో విద్యాశాఖలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఫలితాలు ఎప్పుడు వస్తాయో మరియు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత, 11,000 పైచిలుకు పోస్టుల నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 55 రోజుల్లోనే పరీక్షల నిర్వహణ నుండి 106 మంది టీచర్లకు నియామక పత్రాలు అందించామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు దాదాపు 15 నుండి 20 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్ల సమస్యలను తాము విజయవంతంగా పరిష్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
తీవ్ర నిరాశలో ఉన్న లాంగ్వేజ్ పండిట్స్ సమస్యలతో సహా, దాదాపు 25,950 మంది టీచర్లకు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రమోషన్లు కల్పించామని ఆయన చెప్పారు. అలాగే విద్యాశాఖ మంత్రిగా తాను ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఉపాధ్యాయుల అవసరాలకు తగినట్లుగా 34,706 మంది టీచర్ల బదిలీల ప్రక్రియను పూర్తి చేశానని పేర్కొన్నారు.
జీఓ 317 సమస్యల పరిష్కారం
వివాదాస్పద జీఓ 317 కారణంగా ఎంతోమంది టీచర్లు, ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాలలో ఉంటూ తీవ్ర కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, మొదట విద్యాశాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన దామోదర రాజనర్సింహ వంటి మంత్రులతో కమిటీలు వేసి, దాదాపు 90 శాతం జీఓ 317 సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు.
Frequently Asked Questions
పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా?
ట్రెండింగ్ వార్తలు























