Chakali Ailamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కేసీఆర్ సహా నేతల ఘన నివాళి
Chakali Ailamma: తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఆలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
Chakali Ailamma: నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సహా పలు పార్టీల నేతలు నివాళులర్పించారు. బహుజన ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆమె సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు.
నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం ఆమెకు నివాళులర్పించారు.
— Telangana CMO (@TelanganaCMO) September 26, 2022
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని వివరించారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన తెలంగాణ వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు @drlaxmanbjp ఇతర నేతలు pic.twitter.com/YGx4WNcsTO
— BJP Telangana (@BJP4Telangana) September 26, 2022
Paid tributes to Chakali Ilamma on her Birth Anniversary in #Musheerabad Constituency & at @BJP4Telangana State Office.
— Dr K Laxman (@drlaxmanbjp) September 26, 2021
She was a revolutionary woman freedom fighter who took part & paved the way for women in the Telangana Armed Struggle.@blsanthosh pic.twitter.com/6JABK7HYF8
నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన తెలంగాణ వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
బతుకమ్మ ఆడే సున్నితత్వమే కాదు…
— Revanth Reddy (@revanth_anumula) September 26, 2022
పిడికిలెత్తి పోరాడే పౌరుషత్వం కూడా…
తెలంగాణ ఆడబిడ్డల సొంతం అని చాటిన…
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. pic.twitter.com/luxRmSTa3h
బతుకమ్మ ఆడే సున్నితత్వమే కాదు… పిడికిలెత్తి పోరాడే పౌరుషత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డల సొంతం అని చాటిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.