News
News
వీడియోలు ఆటలు
X

Bhatti Vikramarka on Modi: మోదీజీ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి - 30 ప్రశ్నలతో ప్రధానికి భట్టి విక్రమార్క లేఖాస్త్రం

Bhatti Vikramarka on Modi: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మొత్తం 30 ప్రశ్నలను సంధించారు.

FOLLOW US: 
Share:

Bhatti Vikramarka on Modi: అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పటి వరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన హామీలు అమలు గురించి చెప్పండంటూ ప్రశ్నించారు. మొత్తం 30 ప్రశ్నలతో ప్రధాని మోదీకి భట్టి విక్రమార్క లేఖ రాశారు.


1. 2014 లో మీరు ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?

2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?

3. మీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 20 వేల కోట్లతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు?

4. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిపైన స్పష్టత ఇస్తారా?

5. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఈ నిధులు 2019 నుండి నిలిపివేయడానికి కారణాలు ఏమిటి? 

6. మీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు. 

7. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సీబీఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? మీకు కేసీఆర్‌కు, బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి?

8. కేంద్ర మంత్రిగా కేసీఆర్‌ పనిచేసినప్పుడు జరిగిన సహారా, ఈఎస్‌ఐ స్కామ్‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

9. 2014లో మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యాసంస్థలను తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ముఖ్యంగా ఐఐఎం, ఐఎస్‌ఆర్‌, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, నవోదయ విద్యాలయాలు కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు?

10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన మీ సమాధానం ఏమిటి?

11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటా కేటాయింపుల విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది? సాగునీటి వాటాల కేటాయింపులపై ట్రిబ్యూనల్స్ కు ఎందుకు రిఫర్‌ చేయడం లేదు?

12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కూడా ఏవో సాకులు చెప్పి ఎందుకు నిలిపివేస్తున్నారు?

13.  ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు? 

14. తెలంగాణ రాష్ట్రానికి ఈ 9 ఏళ్లలో జాతీయ స్థాయి ఉన్న ఒక్కవిద్యాసంస్థ కానీ, మెడికల్‌ కళాశాలలు కానీ మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారా?

15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయంను ఎప్పుడు ప్రారంభిస్తారు?

16. తెలంగాణలో అనేక డిఫెన్స్‌ సంస్థలున్నాయి? ఈ రాష్ట్రంలో ఢిపెన్స్‌ క్యారిడార్‌ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?

17. నిజామాబాద్‌ పసుపు బోర్డు ఎప్పటి లోగా ఏర్పాటు చేస్తారు?

18. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి సంబంధమున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? మీకు, కేసీఆర్‌కు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యిందా? 

19. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచనని మీరు హామీ ఇవ్వగలరా? 2014 నుండి ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల కాలంలో వీటిపైన ఎన్నిసార్లు ధరలు పెంచారు?

20. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?

21. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు? ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలను మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కల్పించారు? 

22. మీకు, అదానీకి ఉన్న సంబంధం గురించి తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? దీనిపైన ఇప్పటికైనా నోరు విప్పుతారా?

23. అదానీ పాల్పడ్డ కుంభకోణాల్లో మీ పాత్ర ఉందా? లేదా? ఈ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు? 

24. మీ విద్యార్హతల గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డిగ్రీ సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తీర్పు ఇచ్చిన వ్యక్తి మా తెలంగాణ బిడ్డ. మీరు పాల్గొనే బహిరంగ సభలో మీరు మీ సర్టిఫికేట్‌ను ప్రజల సమక్షంలో చూపడానికి సిద్ధమా? కనీసం మీ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అయినా మీ సర్టిఫికేట్‌ను షేర్‌ చేయగలరా? 

25. 2014 లో మీరు అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు? ఎన్ని కొత్తగా ప్రారంభించారు? దీనిపైన వివరణ ఇవ్వగలరా?

26. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు మంజూరు అయిన ఐటిఐఆర్‌ (ఇంటిగ్రేటేడ్‌ ఇన్వెస్టిమెంట్‌ టెక్నాలజీ రీజియన్‌) ఎందుకు రద్దు చేశారు? దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న కార్యక్రమాలు ఏంటి? 

27. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం సాఫ్ట్‌వేర్‌ రంగానికి పుట్టినిల్లు.  తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు ఎందుకు ఇవ్వడం లేదు?

28. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రఖ్యాత ఫార్మా కంపెనీలున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో కూడా తెలంగాణలోని ఫార్మా కంపెనీయే కీలకపాత్ర పోషించిన విషయం మీకు తెలియంది కాదు. అంత ప్రాధాన్యత ఉన్న తెలంగాణకు ఫార్మాసిటిలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?

29. ట్రెడీషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ నుండి మీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు ఎందుకు తరలించారు?

30. బీజేపీ - బీఆర్‌ఎస్‌ ఉన్న లోపాయకారి ఒప్పందాలను మీరు వెల్లడిరచగలరా? మీ కనుసన్నల్లోనే బీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేస్తున్నదన్న విషయం వాస్తవం కాదా? బీజేపీకి - బీఆర్‌ఎస్‌, ఎఐఎంఐఎం ఇంకా కొన్ని పార్టీలు ‘బి’, మరియు ‘సి’ టీమ్‌లుగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా?

Published at : 07 Apr 2023 04:42 PM (IST) Tags: CONGRESS PM Modi Bhatti Vikramarka Telangana News CLP Leader Bhatti

సంబంధిత కథనాలు

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు