News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

David Sawang : జూబ్లీహిల్స్‌ పబ్‌లో యువతి కోసం యువకుల ఘర్షణ- ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడిపై ఆరోపణలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్‌లో రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు ఉండటంతో ఇప్పుడు ఆ వార్త వైరల్‌గా మారుతోంది. గొడవపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో డేవిడ్‌ సవాంగ్‌ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

FOLLOW US: 
Share:

ఏపీ మాజీ డీజీపీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్‌లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్‌ 10లోని జీరో  పబ్‌ దగ్గర రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందట. ఇందులో ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కొడుకు డేవిడ్‌ సవాంగ్‌ది ఓ వర్గం. అర్థరాత్రి సమయంలో హంగామా జరిగింది.  యువతి విషయంలో.. సిద్ధార్థ గ్యాంగ్‌తో డేవిడ్‌ సవాంగ్‌ గ్యాంగ్‌ గొడవపడినట్టు సమాచారం. ఈ ఉదయం డేవిడ్‌ సవాంగ్‌.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సిద్ధార్థ్‌ గ్యాంగ్‌పై  ఫిర్యాదు చేశాడు. కాసేపట్లో.. సిద్ధార్థ, అతని గర్ల్‌ఫ్రెండ్‌ కూడా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు రానున్నట్టు తెలుస్తోంది.

అసలు ఏం జరిగిందంటే...? 
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జీరో-40 పబ్‌కి రాత్రి డేవిడ్ సవాంగ్ బ్యాచ్‌, సిద్ధార్థ మాగ్నమ్‌ అనే యువకుడి బ్యాచ్ వేర్వేరుగా వెళ్లినట్టు పొలీసులు  చెప్తున్నారు. డేవిడ్ సవాంగ్ ప్రియురాలు... కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. ఇప్పుడు సిద్ధార్థతో డేటింగ్ చేస్తోందట. ఈ విషయంలో డేవిడ్ సవాంగ్‌, సిద్ధార్థ మధ్య  చాలాసార్లు గొడవ జరిగినట్టు సమాచారం. రాత్రి జూబ్లీహిల్స్‌లోని జీరో-40 పబ్‌కు సిద్ధార్థ తన గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లాడు. డేవిడ్‌ సవాంగ్‌ కూడా అదే సమయంలో అదే పబ్‌కు వెళ్లాడు.  డేవిడ్, సిద్ధార్థ ఒకరినొకరు ఎదురుపడటంతో.. మరోసారి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. డేవిడ్ బ్యాచ్‌లో ఐదుగురు ఉండగా... సిద్ధార్థ బ్యాచ్‌లో ఆరుగురు ఉన్నారు. సిద్ధార్థ  బ్యాచ్‌లో ఒక నైజీరియన్ కూడా ఉన్నాడని చెప్తున్నారు.

ఈ రెండు గ్రూపుల మధ్య ఫైట్‌ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. పబ్‌లో  జరిగిన ఈ గొడవ... బయటకు వచ్చిన తర్వాత ఎక్కువైందని తెలుస్తోంది. పబ్‌ బయట కూడా ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణా  రహితంగా కొట్టుకున్నారని సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థకు తీవ్రగాయాలయ్యాయి. డేవిడ్‌ సవాంగ్‌కు కూడా గాయలు అయినట్టు ప్రచారం జరుగుతోంది. 

జీరో-40 పబ్ దగ్గర అర్థరాత్రి ఈ గొడవ జరగగా... ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన డేవిడ్ సవాంగ్... సిద్ధార్థ్‌ గ్యాంగ్‌పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఈ  విషయం వెలుగుచూసింది. పోలీసులు... ఘటనా స్థలానికి వెళ్లి.. గొడవపై ఆరా తీశారు. అసలు ఏం జరిగిందనే వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ  ఫుటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 
కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు సిద్ధార్థ, అతని గర్ల్‌ ఫ్రండ్‌ కూడా రానున్నట్టు సమాచారం.

ఒకప్పటి పోలీస్‌ బాస్‌ సుపుత్రుడు.. ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్‌ కావడం వివర్శలకు తావిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని... వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వొద్దని...  పిల్లల ప్రతి కదలికను పేరంట్స్‌ గమనించాలంటూ చాలాసార్లు స్పీచ్‌లు ఇస్తుంటారు పోలీసు బాస్‌లు. కానీ.. వారి పిల్లల సంగతి ఏంటి..? వారు కూడా వారి పిల్లల విషయంలో  ఇంతే జాగ్రత్తగా ఉంటున్నారా..? లేక... పక్కవారికి సూక్తులు చెప్పి... చేతులు దులుపుకుంటున్నారా..? మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు పబ్‌లో గొడవ చేయడం...  దాడి చేయడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడు... ప్రజల్లో ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి. 

Published at : 14 Sep 2023 12:29 PM (IST) Tags: Hyderabad Jubilee hills David Sawang Gautham Sawang Andra Pradesh ex DGP PUB

ఇవి కూడా చూడండి

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Mega Dairy Project: పాడి రంగంలో మెగా ప్రాజెక్టు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...