Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల ర్యాలీకి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు
చంద్రబాబు అరెస్టును దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, పిల్లలు ఖండించారు.
చంద్రబాబు అరెస్టును దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, పిల్లలు ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా ఐటి ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి సంఘీభావ ర్యాలీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా టీడీపీ ప్రకటించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేయడంపై సర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నిరసనలు మిన్నట్టుకుంటున్నాయి. ఈ ఆందోళన ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ప్రతిచోట ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ నిరసనలు మరింత తీవ్రంగా ఉన్నాయి.
ఖమ్మం మీదుగా రాజమండ్రి కి వెళ్తున్న ఐటీ ఉద్యోగులు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ.. ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం మీదుగా రాజమండ్రి కి వెళ్తున్నారు. హైదరాబాదు నుంచి ఐటీ నిపుణులు చలో రాజమండ్రి కి పిలుపునివ్వటం తో ఆంధ్ర తెలంగాణ బోర్డుర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు చేపట్టారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు. భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు. పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బోర్డర్ వద్ద ఐడి కార్డులు.. వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెడుతున్నారు.
ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ మార్గాల ద్వారా రాజమండ్రికి చేరుకున్నట్టు సమాచారం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు. సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
చంద్రబాబు గారికి మద్దతుగా, ఛలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, ప్యాలెస్ లో భయపడుతూ పడుకున్నాడు తాడేపల్లి పిల్లి#CBNLifeUnderThreat#TDPJSPTogether… pic.twitter.com/xoNGpU8Nv1
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచి పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఏపీలోకి విడిచి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ స్పందించింది. " చంద్రబాబుకు మద్దతుగా చలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులు ఏపీలోకి అడుగుపెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులను దింపి తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి భయపడుతూ పడుకుంది" అంటూ ట్రీట్ చేసింది. ' ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు' అంటూ గరికపాడు వద్ద భారీగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు వీడియోను షేర్ చేసింది.