అన్వేషించండి

BRS Review: లోక్ సభ సీట్లపై కన్నేసిన బీఆర్ ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం

BRS Review: లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారించిన బీఆర్ ఎస్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన తప్పులు సరిదిద్దుకునేలా అభిప్రాయ సేకరణ

BRS NEWS: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్(BRS) లోక్ సభ ఎన్నికల్లో అయినా పట్టునిలుపుకుని సత్తా చాటేందుకు  తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించింది. కీలక నేతలు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harishrao) పాల్గొని శ్రేణుల్లో ధైర్యం నింపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత విరామం అనంతరం మళ్లీ లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు తిరిగి ప్రారంభించనున్నారు.

ఎన్నికల సన్నాహాలు 
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడిన బీఆర్‌ఎస్‌(BRS) నియోజకవర్గ స్థాయి సమీక్ష, లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు తిరిగి ప్రారంభించారు.లోక్ సభ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా గత నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్(BRS)...ఫిబ్రవరి 10 నాటికి సమావేశాలు ముగించేలా ప్లాన్ చేసుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుటికే సుమారు 40 నియోజకవర్గాలు పూర్తికాగా....మిగిలిన చోట్ల నిర్వహించేందుకు పునః ప్రారంభించారు. మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో....ఈనెలాఖరు లోగా సమీక్షలు పూర్తి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.  దీనిపై సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మాజీ మంత్రి హరీశ్‌రావు  షాద్‌నగర్‌ లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. విదేశ పర్యటనలో ఉన్న కేటీఆర్‌(KTR) తిరిగొచ్చాక ఈ భేటీల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు ముగిశాక.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌(KCR) ఆధ్వర్యంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌( Telangana Bhavan)లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

ఓటమిపై సమీక్ష
పార్టీ బలంగా ఉండి,తప్పకుండా  గెలుస్తామనుకున్న చోటా ఓటమి పాలవ్వడంపై  బీఆర్ఎస్(BRS) అధినాయకత్వం  సమీక్షిస్తుంది. ఓటమికి కారణాలను అన్వేషిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ఇది పునరావకృతం కాకుండా జాగ్రత్త వహిస్తోంది.  జనవరి 3 నుంచి 22వ తేదీ వరకు మూడు విడతల్లో 17 లోక్‌సభ సెగ్మెంట్లపై సుదీర్ఘంగా సమీక్షించిన పార్టీ ముఖ్యు లు.. నేతలు, కార్యకర్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ ను నివేదికల రూపంలో కేసీఆర్‌(KCR)కు అందజేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై బీఆర్‌ఎస్‌(BRS) దృష్టి సారించింది. అసెంబ్లీ సమీక్ష సమావేశాల్లో అందరి అభిప్రాయాలను క్రోడీకరించి లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 

నిర్ణయం తీసుకోనున్నారు. నియోజవర్గస్థాయి సమావేశాలకు  పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి(Kadiam Srihari), నిరంజన్ రెడ్డి, పోచారం, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ కు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉన్నా క్షేత్రస్థాయిలో వారిని సమన్వయం చేసే గ్రామ కమిటీలు లేకపోవడం వల్లే అసెంబ్లీ  ఎన్నికల్లో దెబ్బతిన్నట్లు  పార్టీ గుర్తించింది.అందుకే లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే  పార్టీని అన్నిస్థాయిల్లో బలోపేతం చేసేందుకు సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  తెలసింది. 

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget