Bandi Sanjay Speech: పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసింది: బండి సంజయ్
Bandi Sanjay at Chevella Meeting: రాత్రిపూట తనను పోలీసులు అరెస్ట్ చేశారని, 8 గంటలు రోడ్లపై తిప్పారని ఇంటికి పంపించలేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay at Chevella Meeting: రాత్రిపూట తనను పోలీసులు అరెస్ట్ చేశారని, 8 గంటలు రోడ్లపై తిప్పారని ఇంటికి పంపించలేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ దాటిన తరువాత తన భార్య ఫోన్ చేసి, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. తనను కొత్తపల్లి, సిద్దిపేట, గజ్వేల్, భువనగిరి ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదని.. కానీ కొంతదూరం పోయినాక ఏం జరుగుతుందో తెలియక కానిస్టేబుల్స్ టెన్షన్ పడ్డారని.. అయితే భయపడొద్దన్న ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందని చెప్పానన్నారు. కార్యకర్తల్ని కాపాడుకునే పులి అమిత్ షా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి, పార్టీ నేతలకు అండగా నిలిచారని కొనియాడారు.
అభివృద్ధికి అడ్డుపడుతున్న సీఎం కేసీఆర్
చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభలో బండి సంజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న సంకల్పంతో బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచి వస్తున్నారని చెప్పారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, తెలంగాణ ద్రోహిగా మారారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని రకాలుగా దివాళా తీసిన తెలంగాణను డెవలప్ చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఫసల్ భీమా యోజనతో రైతులను ఆదుకుంటాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం.. నియామక ప్రక్రియను చేపడతామన్నారు. ప్రతినెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామన్నారు.
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బండి సంజయ్
కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తుంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వంతో రామ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని, అమిత్ షా నాయకత్వంలో ముందుకు సాగుదామని రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, కేసులకు, జైళ్లకు భయపడేది లేదన్నారు. రాష్ట్రం డెవలప్ కావాలన్నా, రాక్షస పాలన అంతం కావాలన్నా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
అమిత్ షాకు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం..
ఆదివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కీలక నేతలు అమిత్ షాకు ఘటన స్వాగతం పలికారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. అమిత్ షా సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నోవోటెల్ కు వెళ్లిన అమిత్ షా.. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. బీజేపీ నేతలతో సమావేశం తరువాత అమిత్ షారోడ్డు మార్గంలో నేరుగా చేవెళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.