హరీష్‌రావు వర్సెస్ విజయశాంతి, టార్గెట్ ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ను మంత్రి హరీష్‌రావు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్ అయ్యారు. దుబ్బాక, జీహెచ్‌ఎంపీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన చిట్‌చాట్ కామెంట్స్ తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతర్గతంగా రగిలిపోతున్న వాళ్లు కొందరైతే... ఇప్పుడు నేరుగా ట్విట్టర్‌లోనే విమర్సలు మొదలయ్యాయి.
ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ను మంత్రి హరీష్‌రావు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్ అయ్యారు. దుబ్బాక, జీహెచ్‌ఎంపీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చేరికల కమిటీతో వచ్చాయా ప్రజల విజ్ఞతతో వచ్చాయా అని ట్వీట్ చేశారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు,
బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమేనన్నారు. చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్‌లను ప్రస్తావిస్తూ చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు హరీష్ అంటూ వాగ్బాణాలు సంధించారు.
విజయశాంతి టార్గెట్ హరీష్‌రావులా కనిపిస్తున్నప్పటికి ఆమె మెయిన్‌గా టార్గెట్ చేసింది మాత్రం ఈటలనే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. చేరికల కమిటీతో ఓట్లు రాలవని చెప్పకనే చెప్పారామె.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు,
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023
చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... pic.twitter.com/G8ulVzUyTf
అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని గతంలో ఈటల కామెంట్స్ చేశారు. వాళ్లెవరో చెప్పాలని విజయశాంతి నిలదీశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అది ఇప్పుడు ముదిరిందనే టాక్ ఉంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ అన్నారు..హైదరాబాద్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సంసందర్భంగా ఆయన వారితో చర్చల గురించి వివరించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లయింది..
వేర్వేరు పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లు కూడా ఉక్కపోతకు గురి అవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని టిక్కెట్లు కేటాయించాలని ఇద్దరు మాజీ ఎంపీలు ఆ పార్టీని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన్ ఖర్గే దగ్గర ఉందని..ఆయన ఆమోద ముద్ర వేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంటున్నారు. నిజానికి ఆ ఇద్దరు ఎంపీలు స్వతహాగా బీజేపీ నేతలు కారు. పార్టీలు మారి బీజేపీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ గట్టిగా టార్గెట్ చేస్తుందని..గెలిచే పార్టీ అనే నమ్మకంతో చేరారు. ఇప్పుడా నమ్మకం చెదిరిపోవడంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటన్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు బలం అనుకున్న పార్టీయే భారంగా ఉంటోందని పార్టీ నేతలు చెబుతున్నారు. పైకి కనిపించేంత సీన్ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.