Balakrishna: బాలయ్య గొప్ప మనసు - తెలంగాణలో వరద బాధితులకు ఆర్థిక సహాయం
Balakrishna Donation: బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణలో వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు.

Balakrishna Helps Flood Victims In Telangana: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో వరద బాధితులు, రైతుల సహాయార్థం రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈవెంట్‌లో అరుదైన గౌరవం అందుకున్న బాలయ్య ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం సహాయ నిధికి తన వంతు సాయంగా అందిస్తానని చెప్పారు. రైతులకు అండగా ఉంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాలయ్య మంచి మనసుకు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు కామారెడ్డి, జగిత్యాల జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లి తీవ్ర పంట నష్టం సంభవించింది.
Also Read: ఫ్యాన్స్... దర్శక నిర్మాతలే నాకు ఇన్‌స్పిరేషన్ - అందరికీ రుణపడి ఉంటానన్న బాలయ్య






















