అన్వేషించండి

ABP Southern Rising Summit: దేశాభివృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర: నేడు హైదరాబాద్ వేదికగా ఏబీపీ 'సదరన్ రైజింగ్ సమ్మిట్'

ABP Southern Rising Summit 2026:దక్షిణ భారత ప్రగతిని చాటేందుకు ఏబీపీ నెట్‌వర్క్  'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' theme, సదరన్ రైజింగ్ సమ్మిట్ నాలుగో ఎడిషన్ నేడు హైదరాబాద్‌లో జరగనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ నేడు హైదరాబాద్‌లో జరుగుతుంది.
  • 'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' థీమ్‌తో దక్షిణాది ప్రగతి చర్చిస్తారు.
  • సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.
  • ఏబీపీ నెట్‌వర్క్ ఛానెళ్లలో కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' థీమ్‌తో

నేడు హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?


ABP Southern Rising Summit 2026 Hyderabad (Copy Related Text)

ABP Southern Rising Summit: దక్షిణ భారత ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏబీపీ నెట్‌వర్క్ (ABP Network) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సదరన్ రైజింగ్ సమ్మిట్–2026' నాలుగో ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 20న హైదరాబాద్ లో ఈ సదస్సును 'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయ స్టార్టప్ విజయం సాధించడం నుంచి, తెలంగాణ పెట్టుబడులు, ఆవిష్కరణల గమ్యస్థానంగా ఎదగడం వరకు దక్షిణాది సరికొత్త అవకాశాలకు వేదికగా మారింది. ఐటీ స్టార్టప్‌లలో బెంగళూరు, లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచ కేంద్రాలుగా నిలవగా, కర్నూలు 'డ్రోన్ సిటీ'గా గుర్తింపు పొందింది. దక్షిణాది రాష్ట్రాలు సాంకేతికత, అంతరిక్ష రంగం, సామాజిక సంస్కరణలు, వ్యవస్థాపకత ద్వారా దేశాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రపై ఈ వేదికగా విశ్లేషణలు జరగనున్నాయి.

ఉదయం 10:40 గంటలకు సరస్వతీ వందనం, జ్యోతి ప్రజ్వలన, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో సుమంత దత్తా స్వాగతోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో దక్షిణాది ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధ, ఆరోగ్య రంగం మరియు సమకాలీన రాజకీయ సమీకరణాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. ముఖ్యంగా రాజకీయ దిగ్గజాల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం 11:00 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘లాస్ట్ మైల్ గవర్నెన్స్ – మేకింగ్ తెలంగాణ ఫ్యూచర్ రెడీ’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 'ది మైనారిటీ రిపోర్ట్', 3:05 గంటలకు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు 'ఫ్లయింగ్ ఇన్‌టు టర్బులెన్స్', 3:35 గంటలకు ఎంపీ రేణుకా చౌదరి ‘ది ఉమెన్ ఓట్’ అంశాలపై ప్రసంగిస్తారు. సాయంత్రం 4:25 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'లైఫ్ అవుట్ ఆఫ్ పవర్ – రోడ్ బ్యాక్ టు పవర్' అనే అంశంపై, 5:30 గంటలకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ ‘ది సదరన్ ఫ్రంట్’పై ప్రసంగించనుండగా, ఏపీ మంత్రి టి.జి. భరత్, తమిళనాడు మంత్రి వన్ని అరసు తదితర నేతలు దక్షిణాది అభివృద్ధిపై తమ దృక్పథాన్ని పంచుకోనున్నారు.

రాజకీయాలతో పాటు వైద్య, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్‌పర్సన్ శోభనా కామినేని, అరకు కాఫీ సహ-వ్యవస్థాపకుడు మనోజ్ కుమార్, ప్రణవ్ వేంపటి, ధీమంత్ నాగరాజ్, పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్ సహా పలువురు ప్రముఖులు కీలక చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సినీ తార మృణాల్ ఠాకూర్ తమ సినీ ప్రయాణం, దక్షిణాది–ఉత్తరాది సినిమాల అనుబంధంపై ముచ్చటించనున్నారు.

గత మూడు ఎడిషన్ల (2023 చెన్నై, 2024 హైదరాబాద్, 2025) విజయవంతమైన ప్రస్థానం తర్వాతే ఈ నాలుగో ఎడిషన్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:40 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు జరిగే ఈ పూర్తి కార్యక్రమాన్ని ఏబీపీ దేశం (ABP Desam) యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాలతో పాటు telugu.abplive.com వెబ్‌సైట్, ఏబీపీ లైవ్ యాప్ మరియు ఏబీపీ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

Frequently Asked Questions

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ దేని గురించి?

ఈ సమ్మిట్ దక్షిణ భారతదేశ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఉద్దేశించబడింది. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రపై లోతైన విశ్లేషణలు జరుగుతాయి.

ఈ సమ్మిట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతోంది?

ఈ నాలుగో ఎడిషన్ సమ్మిట్ నేడు (శుక్రవారం), హైదరాబాద్‌లో ఉదయం 10:40 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు జరుగుతుంది.

ఈ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులు ఎవరు?

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, అసదుద్దీన్ ఒవైసీ వంటి రాజకీయ ప్రముఖులతో పాటు శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి సినీ తారలు హాజరవుతున్నారు. వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారు.

సదస్సును ప్రత్యక్షంగా ఎక్కడ చూడవచ్చు?

ఏబీపీ దేశం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాలతో పాటు telugu.abplive.com వెబ్‌సైట్, ఏబీపీ లైవ్ యాప్, ఏబీపీ నెట్‌వర్క్ ఛానెళ్లలో సదస్సును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget