Harish Rao On Kaleshwaram Report: మాకు 8బి నోటీసులు ఇవ్వలేదు.. కాళేశ్వరం నివేదిక ఓ చెత్త కాగితం: అసెంబ్లీలో హరీష్ రావు
కాళేశ్వరం కమిషన్ 8బీ నోటీసులు ఇవ్వకుండానే నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదిక ఓ చెత్తకాగితం అంటూ అసెంబ్లీలో చర్చ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Harish Rao on Kaleshwaram Commission Report | హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ముందుగా ఊహించినట్లుగానే సెగలు పుట్టించింది. నివేదకలో గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మొదట యూరియా సమస్యను చర్చించే ప్రయత్నం చేసిన హారీష్ రావును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అడ్డుకున్నారు. యూరియా సమస్య ఇప్పడు వద్దు కాళేశ్వరం గురించి మాత్రమే మాట్లాడండి అంటూ అభ్యంతరం తెలపడంతో తిరిగి కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు వివరణ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రభుత్వం ఇంత ఆదరాబాదరగా ఆదివారం అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చపెట్టారంటేనే వీరి ఉద్ద్యేశ్యం ఏంటో అర్దమవుతోంది. కమిషన్ నిబంధనలు పాటించలేదని మేము కోర్టుకు వెళ్లాము. అది మా హక్కు. కమిషన్ రిపోర్టు క్వాష్ అవుతుందనే భయంతోనే ఈరోజు రిపోర్టు అసెంబ్లీలో పెట్టడంతోనే మీ కుట్ర ప్రజలకు అర్దమవుతోంది. పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కమిషన్ రిపోర్టు పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్దంగా జరిగిందా లేదా అనేది సభలో చర్చించాలి. ఫెయిర్ నెన్ అండర్ కమిషన్ ఎంక్వరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పక్షపాతంగా కమిషన్ విచారణ జరగకపోతే అది చిత్తుకాగితంతో సమానం అని చట్టమే చెబుతోంది. ఇది రాజ్యంగం కల్పించిన హక్కు.
ఒక సభ్యుడిపై ఆరోపణలు చేయాలంటే ముందుగా 8బి, 8సి క్రింద నోటీసులు ఇస్తేనే అది చెల్లుతుంది, లేదంటే చెల్లదు. ఘోష్ కమిషన్ మా హక్కులు కాలరాశారు. మాపై వస్తున్న ఆరోపణలకు మా వద్ద వివరణ తీసుకోకుండానే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. నాకు, కేీసీఆర్ కు ఎవరికీ క్రాస్ ఎగ్జామిన్ కు నోటీసులు ఇవ్వలేదు. కమిషన్ విచారణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముందునుంచే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసారు. కోర్టుల్లో కేసులు వేసి, భూసేకరణకు సైతం అడ్డుపడ్డారు. ఇప్పడు ఈ నివేదిక కూడా అందుకే వేశారు. ఈ నివేదికను పొలిటికల్ వ్యపన్ గా వాడుతున్నారు. చట్టపరిధిలో నిష్ఫక్షపాతంగా విచారణ జరపలేదు. మాకు 8బి క్రింద నోటీసులు ఇవ్వలేదు. ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు. గతంలో అనేక కమిషన్లు 8బి క్రింద నోటీసులు ఇవ్వకపోతే కోర్టులు నివేదికలను కొట్టివేశాయి. ఇది చెత్త రిపోర్టు, తప్పుడు రిపోర్టు అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతుండగా కల్పించుకున్న మంత్రి శ్రీధర్ బాబు కోర్టులో అన్ని విషయాలు త్వరలో తేలతాయన్నారు. కోర్టులో ఉన్న టెక్నికల్ అంశాలు గురించి మీరు మాట్లతున్నారు. అవి కోర్టు ముందు ఉన్నాయి. చట్టపరంగా తేలుతాయి. మేము అడుగుతున్నది కమిషన్ చూపించిన లోపాల గురించి మాత్రమే సభలో మాట్లడండి అన్నారు. మా బాధ్యతలో భాగంగా సభలో నివేదిక పెట్టాము. పార్టీ పరంగా అనవసర విమర్శలు చేయొద్దన్నారు. మేము కేసిఆర్ ప్రభుత్వంపై కక్ష సాధించాలంటే పారదర్శకంగా కమిషన్ లు ఏర్పటు చేసేవాళ్లం కాదు. కమిషన్ నివేదిక పేరుతో రెండేళ్లు ఆగేవాళ్ల కాదన్నారు.
తిరిగి మైక్ అందుకున్న హరీష్ రావు మాట్లడుతూ తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన తప్పుడు నివేదిక ఇది. మేము రిపోర్టను క్వాష్ చేయమని మాత్రమే కోర్టుకు వెళ్లాము. అసెంబ్లీలో రిపోర్టు పెట్టొద్దని మేము వెళ్లలేదన్నారు. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడం వెనుక కట్ర ఉందని రిపోర్టులో చెబుతున్నారు. కానీ 120 టీఎంసీల నీళ్లు తుమ్మిడిహట్టి వద్ద లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ ఇచ్చింది. ఇది మా లబ్ధికోసం మార్చలేదని హరీష్ రావు స్పష్టం చేశారు.





















