News
News
X

Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్, డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు : రేవంత్ రెడ్డి

Revanth Reddy: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు అవుతుందనని జోస్యం చెప్పారు.

FOLLOW US: 

Revanth Reddy: హైదరాబాద్ లో ఇవాళ సీఎల్పీ(CLP) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొ్న్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.1200 మంది తెలంగాణ(Telangana) ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న రేవంత్ రెడ్డి...మహిళలపై జరుగుతున్న అఘాత్యాలలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటుందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చారని చెబుతున్నారని, మంత్రి హత్యకు(Minister Murder) సుపారీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ నేతలే అన్నారు. 

ఎమ్మెల్యేల భూకబ్జాలు
 
'రాష్ట్రంలో ఎమ్మెల్యేల(Mla)భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. ధరణి లోపాల వల్ల హత్యలు జరుగుతున్నాయి. ఇవి కూడా శాంతి భద్రత వైఫల్యమే. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విభజన బిల్లు ద్వారా రావాల్సిన రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటివి సాధించలేదు. సీఎం కేసీఆర్ పరిపాలనలో కలెక్టర్, ఎస్పీలుగా అర్హతలేని వారిని నియమించి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో బిహార్ కు చెందిన అధికారులకే ఉన్నారు. ఐదు మంది బిహార్ అధికారులకు 40 శాఖలు కేటాయించారు. సోమేశ్ కుమార్, అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ కు చెందిన వారిని ఇక్కడ పెట్టుకొని కీలక శాఖలు కేటాయించారు. బిహార్ అధికారులు కేసీఆర్ కు కృతజ్ఞతగా పరిపాలనను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు.' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

సోమేశ్ కుమార్ సర్వీస్ రికార్డు ఇవ్వడం లేదు 

సోమేశ్ కుమార్ సర్వీస్ రికార్డును గత రెండేళ్లుగా అడిగినా ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. గిరిజనులకు పోడు భూములను కుర్చీ వేసుకొని ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ వారిని నిండా ముంచారని విమర్శించారు. మెట్రో విషయంలో గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పూర్తి చేయకుండా నిధులు మెక్కేశారని తీవ్ర విమర్శలు చేశారు. గౌలిగూడ నుంచి ఫలక్ నుమాకు మెట్రో వేస్తే అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందన్నారు. కానీ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వేస్తామని చెబుతున్నారన్నారు. వారి సంబంధికుల భూముల విలువ పెంచడం కోసం కుట్ర జరుగుతోందన్నారు. 

చత్తీస్ గఢ్ లో మంచి పథకాలు 

మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ గతంలో ఫామ్ హౌస్, డ్రగ్స్ విషయంలో సవాల్ విసిరి పారిపోయారని విమర్శించారు. తెలంగాణ కంటే చత్తీస్ గఢ్ లో మంచి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వరికి 1960 మద్దతు ధర ఉంటే చత్తీస్ గఢ్ క్వింటాలకు 2,500 ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వరి కుప్పలపై గుండె పగిలి రైతులు చనిపోతున్నారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేన్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగం జరిగితే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే అవకాశం ఉండేదన్న ఆయన.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోడీకి వ్యతిరేకం అని చెప్పుకోవాలనే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారన్నారు. వర్నర్ ప్రసంగం జరిగితే కాంగ్రెస్ లోటుపాట్లను నిలదీస్తుందనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 

Published at : 06 Mar 2022 09:11 PM (IST) Tags: Hyderabad cm kcr revanth reddy TPCC Budget

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్, 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్, 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల కోరఢా- రెండింటిపై చర్యలు

ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల కోరఢా- రెండింటిపై చర్యలు

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!

దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

టాప్ స్టోరీస్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్

Harsh Goenka: 'ఇందుకే ఆఫీసుకు రమ్మంటోంది- మీకు అర్థమవుతోందా?'

Harsh Goenka: 'ఇందుకే ఆఫీసుకు రమ్మంటోంది- మీకు అర్థమవుతోందా?'

Bigg Boss 6 telugu: ఇంట్లో అమ్మాయి కెప్టెన్ అవ్వాలి అంటూ శ్రీహాన్‌ పై పగ తీర్చుకున్న ఇనయా

Bigg Boss 6 telugu: ఇంట్లో అమ్మాయి కెప్టెన్ అవ్వాలి అంటూ శ్రీహాన్‌ పై పగ తీర్చుకున్న ఇనయా