Hyderabad Cycling Track : హైదరాబాద్ లో సోలార్ రూఫింగ్ సైక్లింగ్ ట్రాక్, నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
Hyderabad Cycling Track : హైదరాబాద్ లో వినూత్నమైన సైకిల్ ట్రాక్ కు రేపు(సెప్టెంబర్ 6) మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఓఆర్ఆర్ వెంబడి 23 కి.మీ మేర ఈ సైక్లింగ్ ట్రాక్ 2023 కల్లా అందుబాటులోకి రానుంది.
Hyderabad Cycling Track : హైదరాబాద్‌లో సోలార్ రూఫ్‌తో ప్రపంచ స్థాయి సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 23 కి.మీటర్ల సైక్లింగ్ ట్రాక్ ను నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 2023 వేసవిలోపు ఈ ట్రాక్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ వెంబడి (నానక్ రాంగూడ -TSPA & నార్సింగి-కొల్లూరు స్ట్రెచ్) 23 కి.మీ పొడవు, 4.5 మీటర్ల వెడల్పు గల సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ పై 16 MW ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను అమర్చనున్నారు.
Had promised that we will develop a world-class, solar-roofed cycling track in Hyderabad. Laying the foundation tomorrow for an initial 21 KM
— KTR (@KTRTRS) September 5, 2022
Plan to deliver it before summer 2023 👍 pic.twitter.com/YTUzvfb4XX
సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్
హైదరాబాద్ లో వినూత్నమైన సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ కు ఒక ట్రెండ్‌సెట్టర్‌గా మారనుందని హెచ్ఎమ్డీఏ అంటోంది. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న సైకిల్ ట్రాక్ ను కోకాపేట్‌లో అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రతిపాదించిన 23 కిలోమీటర్ల సోలార్ సైక్లింగ్ ట్రాక్‌లో ఈ ట్రాక్ భాగం. "ట్రాక్‌ను పైలట్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, మొత్తం 23-కిమీల విస్తీర్ణంలో నిర్మిస్తారు" అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అధికారి ఒకరు తెలిపారు.
ఓఆర్ఆర్ వెంబడి
ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వెంబడి సైకిల్ ట్రాక్ నిర్మాణం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు తదితర పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్లు, నానక్రామ్‌గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ నిర్మించనున్నారు. ఇది సర్వీస్ రోడ్డు, ORR క్యారేజ్ వే మధ్య అభివృద్ధి చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌ల్లా కాకుండా, ఈ సైకిల్ ట్రాక్ సైక్లిస్టులకు ఎండ, వర్షం ఇతర కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణను అందిస్తుంది. అలాగే సాధారణ ట్రాఫిక్ నుంచి దూరంగా ఉండడంతో భద్రతకు భరోసా ఇస్తుంది.
సోలార్ రూఫింగ్ ద్వారా 16 మెగావాట్స్ విద్యుత్
సైక్లిస్టుల కోసం ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు కూడా ట్రాక్ పక్కన ఏర్పాటుచేయనున్నారు. ఇవి 24×7 లైటింగ్ తో ఉంటాయి. లైటింగ్ కోసం సోలార్ రూఫ్ ఏర్పాటుచేస్తారు. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 16 MW శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఈ సోలార్ పవర్ ను ORR వెంబడి డ్రిప్ ఇరిగేషన్, వీధిలైట్ల కోసం వినియోగిస్తారని HMDA అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (RESCO) మోడల్‌ను స్వీకరించారు. దీని ప్రకారం ఒక RESCO ఆపరేటర్ సోలార్ రూఫ్ కోసం అయ్యే వ్యయాన్ని పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని 25 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు.
Also Read : CM KCR : త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి, దేశ వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ - సీఎం కేసీఆర్