![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు- IMD అరెంజ్ అలర్ట్ జారీ
Moderate Rain In Hyderabad | హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది తలెత్తింది.
![Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు- IMD అరెంజ్ అలర్ట్ జారీ Hyderabad Rains Moderate Rain Spell for Entire Hyderabad City on 14 July 2024 Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు- IMD అరెంజ్ అలర్ట్ జారీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/14/b34c3eb891bd2658e34173a83d124f521720964012417233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Rain News updates | హైదరాబాద్: భాగ్యనగరాన్ని మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమే కనిపించగా.. సాయంత్రానికి వాతావరణం మరింతగా మారిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా బాచుపల్లి, నిజాంపేట, కూకట్ పల్లి, ప్రగతినగర్, మాదాపూర్, కొండాపూర్, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, గాజులరామారం, ఖైరతాబాద్, మెహిదీపట్నం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. కొన్ని గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ నిపుణులు సూచించారు. నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Raining Heavily in #Jeedimetla 🌧️💨#Hyderabadrains pic.twitter.com/2nQ13AWyYo
— Hyderabad Rains (@Hyderabadrains) July 14, 2024
నేరేడ్‌మెట్, కాప్రా, సైనిక్‌పురి, మౌలాలి, ఘట్‌కేసర్, నాచారం, చర్లపల్లి, బోడుప్పల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అబిడ్స్, హయత్ నగర్, ఎల్బీనగర్, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కుషాయిగూడ సహా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది.
దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురవన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు పశ్చిమబెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావం కూడా ఉండటంతో నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గురువారం వరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
IMPACT BASED FORECAST FOR HYDERABAD CITY & NEIGHBOURHOOD DATED:14.07.2024 issued at 16:30 IST @GHMCOnline @Director_EVDM @HYDTP pic.twitter.com/IlxiXr4wre
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 14, 2024
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురవన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: మంచిర్యాల గాలిలో నాణ్యత ఎంత? రామగుండం వాసులు పీల్చే గాలి స్వచ్ఛంగా ఉందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)