పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అర్హుల జాబితాను ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు.



కేవైసీ చేయని వారిని, చనిపోయిన వారిని, పత్రాలు అప్‌లోడ్ చేయని వారిని తొలగిస్తుంటారు



ఇలా రివైజ్ చేస్తున్న టైంలో పొరపాటున మీ పేరు తొలగించేశారేమో చెక్ చేస్కున్నారా?



అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం



ముందుగా https://pmkisan.gov.in/ కి వెళ్లాల్సి ఉంటుంది.



అందులో అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.



ఆ లిస్ట్‌లోనే నో యువ స్టాటస్‌ అని పింక్‌ కలర్‌లో బాక్స్ కనిపిస్తుంది.



దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.



రిజిస్ట్రేషన్ నెంబర్‌ పక్కనే క్యాప్చా కోడ్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయాలి.



ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేస్తే లబ్ధిదారుల జాబితా వస్తుందని



రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకుంటే ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్‌తో తెలుసుకోవచ్చు.



నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.



వేరే బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫోన్‌ నెంబర్ లేదా, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి.



అందులో ఫోన్‌ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ టైప్ చేయాలి. తర్వాత ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.



లేకుంటే మీ ఆధార్‌ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ టైప్ చేయాలి. తర్వాత ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుస్తుంది