News
News
X

HPS : ప్రపంచ బ్యాంకుకు కాబోయే అధ్యక్షుడు అజయ్ బంగా హైదరాబాద్ విద్యార్థే!

HPS : హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థి అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ అవ్వడంపై స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

FOLLOW US: 
Share:

HPS : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట) మరో ఘనత సొంతం చేసుకుంది. హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థి అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. అజయ్ బంగా హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థికి అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.  దేశంలోని ప్రముఖ పాఠశాలలో ఒకటి అయిన హెచ్‌పీఎస్, 2023లో 100వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది.  కార్పొరేట్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, పబ్లిక్ సర్వీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్పోర్ట్స్‌, ఇతర రంగాలలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని హెచ్.పి.ఎస్ యాజమాన్యం తెలిపింది. 2019 హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రపంచ వ్యాప్తంగా "టాప్ 10" బెస్ట్‌ సీఈవో జాబితాలో హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు సత్య నాదెల (సీఈఓ, మైక్రోసాఫ్ట్), శంతను నారాయణ్ (సీఈఓ, అడోబ్), అజయ్ పాల్ బంగా ఉన్నారు.  

హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థుల్లో ప్రముఖులు

మాల్పాస్ తర్వాత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా.. మాస్టర్ కార్డు మాజీ సీఈవో అజయ్ బంగాను యూఎస్ఏ అధ్యక్షుడు నామినేట్ చేశారు. అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1976 బ్యాచ్‌కి చెందినవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట బ్యాంచ్ లో చదువుకున్న ప్రముఖులు- అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్, IFS, UNలో భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి, సయ్యద్ బషరత్ అలీ, సహ వ్యవస్థాపకుడు, కేవీయం కంపెనీ, సీవీ ఆనంద్, IPS, హైదరాబాద్ కమిషనర్,  తలత్ అజీజ్, ప్రఖ్యాత గాయకుడు, అజయ్ బంగా, వైస్-ఛైర్మన్, జనరల్ అట్లాంటిక్, హర్ష భోగ్లే, క్రికెట్ కామెంటెటర్, జర్నలిస్ట్; లార్డ్ కరణ్ బిలిమోరియా, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు, UK; ఎయిర్ మార్షల్ జొన్నలగెడ్డ చలపతి, AVSM, ASM, AOC-in-C, సదరన్ ఎయిర్ కమాండ్;  రానా దగ్గుబాటి, నటుడు;  అక్కినేని నాగార్జున, నటుడు, నిర్మాత, అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ ఎమ్మెల్యే ; అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ; కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం ;  మేనకా గురుస్వామి, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు;  అశోక్ గజపతి రాజు, మాజీ కేంద్ర మంత్రి;  ఎం.ఎం.పల్లం రాజు, మాజీ కేంద్ర మంత్రి; శైలేష్ జెజురికర్, COO, P&G;  సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో, మైక్రోసాఫ్ట్ ;  సతీష్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, నాసా జాన్సన్ స్పేస్ సెంటర్;  శంతను నారాయణ్, CEO, Adobe, Inc;  శ్రీరామ్ పంచు, సీనియర్ న్యాయవాది, వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం,  రామ్ చరణ్ తేజ్, నటుడు;  D. బాల వెంకటేష్ వర్మ, IFS, రష్యన్ ఫెడరేషన్‌లో భారత మాజీ రాయబారి; ప్రేమ్ వాట్సా, ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 


హెచ్.పి.ఎస్ సొసైటీ ప్రెసిడెంట్  గుస్తీ జె. నోరియా మాట్లాడుతూ, “మా పూర్వ విద్యార్థుల్లో మరొకరు ప్రపంచ స్థాయి సంస్థలో టాప్ పొజిషన్ కు చేరుకోవడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. అజయ్  బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారని తెలిసి మేము చాలా గర్విస్తున్నాం. మేము లీడర్స్ ను తయారుచేయడంలో మా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అజయ్ బంగాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హెచ్.పి.ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొనాలని మేము ఎదురుచూస్తున్నాం." అన్నారు.  

హెచ్.పి.ఎస్ గురించి 

'100 సంవత్సరాల క్రితం స్థాపించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. రేపటి తరం నాయకులను తయారుచేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడంలో హెచ్.పి.ఎస్ సహాయపడుతుంది. స్వీయ-ఆవిష్కరణపై ఆధారపడే అభ్యాస పద్ధతులు, ఉత్సుకతను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడంలో హెచ్.పి.ఎస్ విశేషకృషి చేస్తుంది. 120 ఎకరాల క్యాంపస్, అత్యాధునిక ప్రయోగశాలలు, సహజంగా వెంటిలేషన్ ఉండే తరగతి గదులు, క్రీడా మౌలిక సదుపాయాలు, నివాస సౌకర్యాలు, అత్యుత్తమ అధ్యాపకులు, విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది ఉన్నారు. షాహీన్, గంభీరమైన ఈగిల్, పాఠశాల చిహ్నం. ఇది ఇన్స్టిట్యూట్ ఫిలాసఫీని గుర్తుచేస్తుంది. HPS పూర్వ విద్యార్థులు గ్లోబల్ కార్పొరేషన్‌లను నిర్వహించే లేదా వారి రంగాలలో విజయవంతమైన స్థాయిలలో ఉన్నారు. 2019లో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ విడుదల చేసిన టాప్ 10 సీఈవో జాబితాలో హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థులలో ముగ్గురు ఉన్నారు. అజయ్ పాల్ బంగా, శంతను నారాయణ్, సత్య నాదెళ్ల ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన “టాప్ 10” CEO లలో ఉన్నారు.  2023లో HPS శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి పాఠశాలల్లో ఒకటిగా అవతరించాలనే సాహసోపేతమైన నిర్ణయంపై దృష్టి సాధించేందుకు సిద్ధమవుతోంది.' అని హెచ్.పి.ఎస్ నిర్వాహకులు తెలిపారు. 

Published at : 24 Feb 2023 03:15 PM (IST) Tags: Hyderabad USA World Bank Ajay Banga HPS Alumnus

సంబంధిత కథనాలు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాల‌కృష్ణ

Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాల‌కృష్ణ

టాప్ స్టోరీస్

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం

Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం