అన్వేషించండి

TG High Court Verdict: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

TG High Court Verdict: వివాహ బంధంలో చిన్న కారణాలను క్రూరత్వంగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఓ విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ హైకోర్టు: చిన్న గొడవలు క్రూరత్వం కావు, విడాకులు ఇవ్వలేం.
  • భర్త వేధింపుల ఆరోపణలు, గృహహింస కేసు క్రూరత్వం కాదు.
  • 14 ఏళ్లు వేరుగా ఉన్నా, దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.

TG High Court Verdict: దాంపత్య జీవితంలో సాధారణంగా వచ్చే చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలను 'క్రూరత్వం' కింద పరిగణించి విడాకులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ బంధంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను క్రూరత్వంగా చూడలేమని, ఆ వ్యక్తితో ఇకపై కలిసి జీవించలేమనే స్థాయికి పరిస్థితి దిగజారితేనే విడాకులకు ప్రాతిపదిక అవుతుందని కోర్టు తేల్చిచెప్పింది.

కేసు వివరాలు 

ఒక వ్యక్తికి 2009లో వివాహం కాగా, పాప పుట్టిన తర్వాత భార్య తనను వేధిస్తోందంటూ అతడు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. అయితే, ఈ పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేసింది. తమ దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను దిగువ కోర్టు అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ కె.సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి తాజాగా తీర్పు ఇచ్చింది. 

 భార్య మానసిక సమస్యతో బాధపడుతోందన్న ఆరోపణలకు, ఇల్లరికం రావాలంటూ భార్య, అత్తమామలు వేధిస్తున్నారంటూ భర్త చేసి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. భార్య తనపై గృహహింస కింద కేసు పెట్టి వేధించిందని భర్త వాదించినప్పటికీ, ఆ కేసును కోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తుచేసింది. అయితే, కేవలం గృహహింస కేసు దాఖలు చేసినంత మాత్రాన దాన్ని భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

కేసు దాఖలు చేసిన సమయంలో భర్త వయసు 36 ఏళ్లు, భార్య వయసు 30 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం భర్తకు 50, భార్యకు 44 ఏళ్లు, కూతురికి 16 ఏళ్లు ఉన్నాయి. వీరు గత 14 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. పెద్దగా విభేదాలు లేని దంపతులు, అనవసరంగా సమస్యలను ఎక్కువ చేసుకొని చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం ప్రయత్నించారని హైకోర్టు అభిప్రాయపడింది. చిన్న కారణాలతో విడాకులను అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేస్తూ, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 

Also Read: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్

చట్టాలు ఏం చెబుతున్నాయి

హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు కోసం 'క్రూరత్వం' ఒక ప్రాతిపదిక. అయితే సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పుల ప్రకారం.. సాధారణ వైవాహిక జీవితంలో జరిగే చిన్నచిన్న ఘర్షణలు, మనస్తాపాలు, మాటలను క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టులు చెబుతున్నాయి. అది మానసికంగా లేదా శారీరకంగా భరించలేనంత తీవ్రంగా ఉంటేనే క్రూరత్వంగా పరిగణిస్తామని చెబుతున్నాయి. 14 ఏళ్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, చట్టపరమైన కారణాలు లేకపోతే కేవలం కాలయాపన కారణంగా కోర్టులు ఆటోమేటిక్‌గా విడాకులు మంజూరు చేయవు. వివాహ బంధాన్ని నిలబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తూ కోర్టులు ఇలాంటి సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా దాంపత్య హక్కుల పునరుద్ధరణకు మొగ్గు చూపుతుంటాయి.

Also Read: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Frequently Asked Questions

విడాకుల కోసం 'క్రూరత్వం' అంటే ఏమిటి?

దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలను క్రూరత్వంగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. మానసికంగా లేదా శారీరకంగా భరించలేనంత తీవ్రంగా ఉంటేనే అది క్రూరత్వం అవుతుంది.

కేవలం గృహహింస కేసు దాఖలు చేసినంత మాత్రాన అది క్రూరత్వం అవుతుందా?

కేవలం గృహహింస కేసు దాఖలు చేసినంత మాత్రాన దాన్ని భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులో వాదనలు, తీర్పును బట్టి కోర్టు నిర్ణయం ఉంటుంది.

ఎక్కువ కాలం విడివిడిగా ఉన్నంత మాత్రాన విడాకులు మంజూరు అవుతాయా?

చట్టపరమైన కారణాలు లేకపోతే కేవలం కాలయాపన కారణంగా కోర్టులు ఆటోమేటిక్‌గా విడాకులు మంజూరు చేయవు. వివాహ బంధాన్ని నిలబెట్టడానికే కోర్టులు ప్రాధాన్యత ఇస్తాయి.

దాంపత్య జీవితంలో చిన్నపాటి గొడవలపై హైకోర్టు అభిప్రాయం ఏమిటి?

సాధారణంగా వచ్చే చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలను 'క్రూరత్వం' కింద పరిగణించి విడాకులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. చిన్న కారణాలతో విడాకులను అనుమతించబోమని పేర్కొంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Praja Balam : సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Embed widget