News
News
X

Minister KTR : దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక విధానాలు, కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

Minister KTR : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్థిక వ్యవస్థపై చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం వైఫల్యాలను దాచేందుకు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

FOLLOW US: 

Minister KTR : కేంద్ర ఆర్థిక విధానాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.  నిర్మలా సీతారామన్ డొంక తిరుగుడు ప్రసంగంతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని కేటీఆర్ విమర్శించారు.  పార్లమెంట్ లో  దేశ ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ప్రజల పడుతున్న బాధలపై నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పారన్నారు. లోక్ సభలో చేసిన తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు పడుతున్న కష్టాలను ఆమె  అవహేళన చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి డొంక తిరుగుడు మాటలు మాట్లాడారన్నారు. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు.  దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వంలో చరిత్రలో నిలుస్తుందన్నారు. 

రూపాయి క్షీణత 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందని, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 సంవత్సరాల అత్యధికం నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్థాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం ఇందుకు ఉదాహరణలు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగిచే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితమే అన్నారు. అనాలోచిత డిమానిటైజేషన్, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో చతికిల పడిందన్నారు.  డిమానిటైజేషన్ కు ముందు 18 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉంటే, ప్రస్తుతం 31 లక్షల కోట్లు నగదు చలామణిలో ఉందన్నారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68 శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని, కేవలం నగదు ముద్రణకే అర్‌బీఐ ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. 

జీఎస్టీతో ఇబ్బందులు 

జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, అర్థంలేని పన్ను స్లాబ్ లతో పాటు, ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై భారీగా పన్నులు విధించి దోపిడీ చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు పరిశ్రమలను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువుల పైనా భారీగా పన్ను వేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేనేత వస్త్రాలపై కూడా జీఎస్టీ మోపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడుకునే పెన్సిల్లు నుంచి హాస్పిటల్ బెడ్ల వరకు చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోదీదని కేటీఆర్ మండిపడ్డారు.

పన్నుల భారం 

ప్రజలపై పెట్రో పన్నుల భారాన్ని మోపి కేంద్రం దోపిడీకి పాల్పడుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2014 వరకు పెట్రోల్, డీజిల్ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వ టాక్స్ లను భారీగా పెంచిదని,  పెట్రోల్ పై ట్యాక్స్ రెట్టింపు చేయడంతో పాటు డీజిల్ పైన సుమారు నాలుగున్నర రెట్లు పెంచిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్రాలకు సమానపు ఆదాయం వస్తుంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన భారీ  పన్నుల వలన మోదీ ప్రభుత్వం దాదాపు రెండున్నర రెట్లు ఆదాయం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుందన్నారు. పెంచిన పెట్రో పన్నుల భారం నేరుగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసి ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు.

క్రోనీ క్యాపిటలిజం 

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే  మోదీ ప్రభుత్వ  అసలైన ఆర్థిక విధానాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపైన కేంద్ర ప్రభుత్వ  యంత్రాంగాలను ఉసిగొలిపి, విభజించు పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా లేని గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం కోసం ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ హితవు  పలికారు.

Published at : 04 Aug 2022 07:19 PM (IST) Tags: minister ktr PM Modi TS News Nirmala seetaraman Hyderabad News inflation central govt rupee value

సంబంధిత కథనాలు

Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు

Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75

Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75

Breaking News Telugu Live Updates: దేవరుప్పుల నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

Breaking News Telugu Live Updates: దేవరుప్పుల నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

టాప్ స్టోరీస్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్