World Cancer Day: త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ : మంత్రి హరీశ్ రావు
పీహెచ్సీ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గ్రామస్థాయిలో 40 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తామన్నారు.
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లక్డీకాపూల్ లోని ప్రభుత్వ ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, 100 పడకల భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 30 ఏళ్లల్లో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్ ను గుర్తించారన్నారు. ఆహారంలో మార్పుల ద్వారా బరువుని అదుపులో ఉంచితే కొంత వరకు క్యాన్సర్ ని నియంత్రించవచ్చని సూచించారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తాయన్న మంత్రి...పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీపీ, షుగర్ వ్యాధుల లాగే క్యాన్సర్ ని కూడా స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పీహెచ్సీ సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. గ్రామ స్థాయిలో 40 ఏళ్లు దాటినా అందరికీ క్రమంతప్పకుండా స్క్రీనింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 22% నోటి, 13% బ్రెస్ట్, 12% గర్భాశయ క్యాన్సర్ లు రాష్ట్రంలో వెలుగుచూస్తున్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఏంఎన్ జెలో అధునాతన సిటీ స్కాన్ 7.16 కోట్లతో ఏర్పాటు అవుతోందన్నారు. రోటరీ క్లబ్ ప్రోత్సహంతో కోటి రూపాయలతో రూపొందించిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
తర్వలో రోబోటిక్ థియేటర్
సర్వేకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ లను స్క్రీన్ చేసేందుకు ఈ బస్ ఉపయోగపడుతుంది. నినారావు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.3 కోట్లతో రోగుల కోసం 300 పడకలతో ఏర్పాటు చేసిన భవనం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. డెంటల్ ఎక్స్ రే కోసం ఓపీజీ మెషిన్ ని మంత్రి ప్రారంభించారు. ఉద్యోగుల కోసం 23 ప్రత్యేక గదుల బ్లాక్ ని రూ.3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఏంఎన్ జె కాన్సర్ ఆస్పత్రికి తెలంగాణ ఏర్పాడ్డక నిధులు రెట్టింపు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 300 పడకల ఆస్పత్రిని రూ.65 కోట్లతో అరబిందో ఫార్మా నిర్మిస్తున్నారన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్త బ్లాక్ అందుబాటులోకి రానుందన్నారు. మరో 3 ఎకరాల స్థలాన్ని ఎంఎన్ జె ఆసుపత్రికి కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం ఎంఎన్ జె ఆసుపత్రిలో మూడు ఆపరేషన్ థియేటర్ లు మాత్రమే ఉన్నాయని, రూ.15 కోట్ల తో త్వరలో 8 మాడ్యులార్ థియేటర్ లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ అని తెలిపారు. మార్చి నెలాఖరుకు కొత్త ఆపరేషన్ థియేటర్ లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ రోగులకు చికిత్స అందుతోందన్నారు.
హెల్త్ సిటీలో అన్ని రకాల వైద్యాలు
జాయింట్ రీప్లేస్మెంట్ కోసం వైద్యులు 3డీ టెక్నాలజీ వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. ఏడాదికి 15000 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు ఆందోస్తోందని తెలిపారు. వరంగల్ హెల్త్ సిటీలో అన్ని రకాల వైద్యాలను అందిస్తామన్న మంత్రి హరీశ్... కిమో, రేడియో థెరపీలను జిల్లా అసుపత్రుల్లోనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు. త్వరలో ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లలో ప్రారంభిస్తామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ పూర్తి చేయడంలో కరీంనగర్ రికార్డ్ సృష్టించిందన్నారు. ఇటీవల హన్మకొండ సైతం రెండో డోస్, టీనేజర్ లకు సైతం 100% తొలి డోస్ పూర్తి చేసుకుందని మంత్రి అన్నారు.