Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
Dating app pub scam Hyderabad: డేటింగ్ యాప్‌లో హలో అనుకున్నారు. ఆమె పబ్‌కు పోదాం అంది. ఒక్క బీరుకే .. బిల్లు చూస్తే.. 29వేలు దాటింది. డేటింగ్ యాప్ పేరుతో హైదరాబాద్‌లో జరుగతన్న నయా మోసం ఇది..!

- హేమంత్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయితో పబ్‌కు వెళ్ళాడు.
- ఒక్క బీరుకు 30 వేల బిల్లు రావడంపై హేమంత్ షాకయ్యాడు.
- బిల్లుపై ప్రశ్నించగా పబ్ సిబ్బంది బెదిరించారని హేమంత్ ఫిర్యాదు.
- డేటింగ్ అమ్మాయి, పబ్ కుమ్మక్కయ్యారని పోలీసులకు బాధితుడు ఫిర్యాదు.
Dating scam in Hyderabad: ఓ అమ్మాయితో బ్లైండ్ డేట్ చేద్దామనుకున్న యువకుడికి.. నిజంగానే కళ్లు బైర్లు కమ్మాయి. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హేమంత్.. కొత్తవాళ్లతో పరిచయం కోసం అనుకుంటూ Quack Quack డేటింగ్ యాప్‌లో ఈనెల 27న ఓ ప్రొఫైల్‌కు పింగ్ చేశాడు. అటువైపు నుంచి దివ్య అనే అమ్మాయ హాయ్ చెప్పింది. ఒక్కరోజు పరిచయంలోనే పబ్‌కు వెళదాం పద అంది. తన పంట పండిందిలే అనుకున్న యువకుడికి బిల్లు రూపంలో కోలుకోలేని షాక్ తగిలింది. పబ్‌లో ఒక్క విజిట్‌కే దాదాపు 30వేలు బిల్ అయింది
జూబిలీహిల్స్ నీరూస్ జంక్షన్ దగ్గర కలుద్దామని చెప్పడంతో ఆమెను తీసుకుని దగ్గరలో ఉన్న 36 కెమిస్ట్రీ పబ్‌కు తీసుకెళ్లినట్లు హేమంత్ చెబుతున్నాడు. అక్కడ కొంతసేపు ఇద్దరూ సరదాగా చిల్ అయ్యారు. తాను కేవలం ఒక్క బీర్ మాత్రమే తాగానని తీరా బిల్లు చూస్తే .. గుండె గుభేల్ మందని హేమంత్ అంటున్నాడు. తనతో పాటు ఉన్న దివ్య కొన్ని నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మాత్రమే తీసుకుందని.. తీరా బిల్లు చూస్తే.. 29,884రూపాయలు వచ్చిందన్నారు. అడిగితే ఆమె తీసుకుంది ప్రీమియం డ్రింక్స్ అని పబ్ సిబ్బంది వచ్చారు. దీనిపై అనుమానం వచ్చి ప్రశ్నిస్తే బౌన్సర్లు చుట్టిముట్టి బెదిరించారని హేమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అమ్మాయితో ట్రాప్... పబ్ నిర్వాకం.
అయితే తనకు డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిపై కూడా హేమంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పబ్ నిర్వాహకులు.. ఆ అమ్మాయి కలిసే.. డేటింగ్ యాప్‌లో తనను ట్రప్ చేశారని ఫిర్యాదు చేశాడు. ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు.. తాను ఇందులో 10వేలు ఇస్తానని ఆమె డబ్బులు ట్రాన్సఫర్ చేసి అక్కడ నుంచి జారుకుందని హేమంత్ ఆరోపిస్తున్నాడు. ఆ ట్రాన్సాక్షన్ కూడా ఫేక్ అని ఇతని ఆరోపణ. అసులు తన పేరు దివ్య కాదని.. కావ్య అని.. ఆమెకు పబ్ వాళ్లకు సంబంధం ఉందని హేమంత్ వాదిస్తున్నాడు.
పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన CCTV ఫుటేజ్, ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో డేటింగ్ పేరుతో డబ్బులు దోచేసే.. నయా స్కాం రన్ అవుతోందని అర్థమవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















