Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎం వార్నింగ్
Munawar Faruqui : స్టాండప్ కమెడియన్ మునవార్ ఫారుఖీ ఆగస్టు 20న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ షో నిర్వహిస్తే అడ్డుకుంటామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు.
Munawar Faruqui : స్టాండప్ కమెడియన్ మునవార్ ఫారుఖీ హైదరాబాద్ లో షో చేయబోతున్నారు. ఆగస్టు 20న లైవ్ షో నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షోను అడ్డుకుంటామని బీజేవైఎం నేతలు ప్రకటించారు. స్టాండప్ కమెడియన్ మునవార్ ఫారుఖీ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా చేసిన లాకప్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి అతని దశ తిరిగిపోయింది. ఆ షోలో తనదైన మార్క్ కామిక్ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ షో విన్నర్‌గా నిలిచారు. దీంతో మునవార్ ఫారుఖీ క్రేజ్ పెరిగింది. అతడు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అతడు హైదరాబాద్‌లో షో చేయబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 20వ తేదీన ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ లో షో
ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించారు. అయితే సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఈ షోను అడ్డుకుంటామని బీజేపీ, బీజేవైఎం నాయకులు అంటున్నారు. ఫారుఖీ షోను అడ్డుకుంటామని, అనుమతి ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ షోకు అనుమతిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఈ విషయంపై డీజీపీని బీజేవైఎం నేత నితిన్ నందకర్ కలిశారు. ఈ షోకు అనుమతిస్తే అడ్డుకుంటామన్నారు. హైదరాబాద్ లో ఆగస్టు 20న మునవార్ ఫారుఖీ షో నిర్వహిచకూడదని స్పష్టం చేశారు. గతంలో ఈ షోకు మంత్రి కేటీఆర్ అనుమతిచ్చారు. అప్పటిలో బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేవైఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 20న షో జరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
కర్నాటకలో బ్యాన్
హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షారుఖీ షోలో వాఖ్యలు ఉంటాయని బీజేవైఎం నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా హిందువులకు వ్యతిరేకంగా కమ్యునల్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ షోకు అనుమతి ఇవ్వవద్దని బీజేవైఎం నేత నితిన్ నందకర్ డీజీపీని కోరారు. ఈ విషయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫారుఖీ షో నిర్వహిస్తే, ఆ ప్రదేశాన్ని తగలబెట్టేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో ను నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసు అధికారుల్ని రాజాసింగ్ కోరారు. అతడికి ఎవరైనా సహకరిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. మునవార్ ఫారుఖీ ఓ కార్యక్రమంలో సీతాదేవిపై జోకులు వేయడంతో తీవ్ర వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ కూడా చేశారు. అందుకే హైదరాబాద్‌లోనూ ఫారుఖీ షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు.
View this post on Instagram
Also Read : Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !