By: ABP Desam | Updated at : 10 Jul 2022 06:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం కేసీఆర్
CM KCR Review On Rains : తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా, జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా
భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశాలని ఆదేశించారు. భారీవర్షాల నేపథ్యంలో ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందున ఎస్సారెస్పీలో పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్న కారణంగా ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్ లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఆరు గంటలకొకసారి సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ప్రయాణాలు మానుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటుచేసి, పర్యవేక్షిస్తున్నామని టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామ రెడ్డి సీఎంకు వివరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద పరిస్థితులపై ఆరా
జీహెచ్ఎంసీ పరిధిలో వరద పరిస్థితులను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజమాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు. వానలు ఆగినా వచ్చే వరదలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందనే దృష్టితో కార్యాచరణ ఉండాలన్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశం ఉందని నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు.
Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎం వార్నింగ్
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది
Nizamabad News: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన తెలంగాణ యూనివర్శిటీ
Breaking News Live Telugu Updates: మంత్రి బొత్సతో అసంపూర్తిగా ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు
WhatsApp New Feature: వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల