అన్వేషించండి

Renuka Chowdhury : ఎస్సై కాలర్ పట్టుకున్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Renuka Chowdhury : కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు.

Renuka Chowdhury :  కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. రేణుకా చౌదరి ఎస్సై చొక్కా పట్టుకున్నారు. బాధిత ఎస్సై ఫిర్యాదు మేరకు ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల రాజ్ భవన్ ముట్టడిలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఉపేంద్ర ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది? 

రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్‌ భవన్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హంగామా సృష్టించారు. కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్‌వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు. మహిళా పోలీసులు ఆమెను చుట్టు ముట్టి ముందుకు పోనీయకుండా చేశారు. దీంతో ఆమె ఒక్క సారిగా శివాలెత్తిపోయారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ఒక్క సారిగా మోచేత్తో పొడిచారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎస్‌ఐ చొక్కా కూడా పట్టుకున్నారు. ఓ వైపు ఇతర నేతలు రాజ్ భవన్ వైపు దూసుకెళ్తూంటే.. రేణుకా చౌదరిని కంట్రోల్ చేయాడానికి మహిళా పోలీసులు తంటాలు పడాల్సి వస్తోంది. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తూంటే..  పోలీసులు కుట్ర పూరితంగా ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. అతి కష్టం మీద రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

రణరంగమైన రాజ్ భవన్ ముట్టడి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఫ్యామిలీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ర్యాలీలు నిరసనలను కాంగ్రెస్ చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన అగ్గిరాజేసింది. కాంగ్రెస్‌ సీనియర్ నేతలంతా రాజ్‌భవన్‌ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు బైక్‌ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ కొద్ది నిలిచిపోయాయి. 

కొందరు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్‌ ఆర్టీసీ బస్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌లో చెపట్టిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా శివసేన రెడ్డి కాలు పోలీసు వాహనంలో ఇరుక్కుంది. దీంతో ఆయన పోలీసు వాహనాన్ని కాలితో తన్ని అద్దాలు ధ్నంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. రాజ్ భవన్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget