News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rains Alert: తెలంగాణలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ - ఏపీలో నేడు వాతావరణం ఇలా

RFains In AP And Telangana: ఏపీలో ఆగస్టు 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుడగా, తెలంగాణలోనూ మరో 5 రోజులు కుండపోత తప్పదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

FOLLOW US: 
Share:

Rains In Telangana: నైరుతి రుతుపవనాలు, ఉతరితల ఆవర్తనం ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో ఆగస్టు 3 వరకు భారీ వర్షాలు కురవనుడగా, తెలంగాణలో ఆగస్టు 4 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 4 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 3 వరకు  తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల పడతాయని అధికారులు తెలిపారు.  
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కేవలం ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం.  

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

Published at : 31 Jul 2022 07:16 AM (IST) Tags: telangana rains rains in telangana Weather Updates ap rains rains in ap AP Rains

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 29 November 2023: ఆరు నెలల గరిష్టంలో తిష్ట వేసిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 29 November 2023: ఆరు నెలల గరిష్టంలో తిష్ట వేసిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Telangana Elections 2023 : ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష - పట్టణ ఓటర్లు ఓటెత్తితే సంచలనమే !

Telangana Elections 2023 : ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష -  పట్టణ ఓటర్లు ఓటెత్తితే సంచలనమే !

Weather Latest Update: 48 గంటల్లో బంగాళాఖాతంలో తుపాను, ఏపీ తెలంగాణపై ఎఫెక్ట్ ఉంటుందా?: ఐఎండీ

Weather Latest Update: 48 గంటల్లో బంగాళాఖాతంలో తుపాను, ఏపీ తెలంగాణపై ఎఫెక్ట్ ఉంటుందా?: ఐఎండీ

Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Telangana Elections 2023 Live  News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

టాప్ స్టోరీస్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి