Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Rains in AP Telangana: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
![Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా Heavy Rains in AP Telangana: Light to moderate Rain or Thundershowers very likely to occur isolated places in Andhra Pradesh Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/e90c9d813b7da18ae743ea5e1bf3e4f71660613714510233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rains In Telangana: వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడింది. అంతకుముందు ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసరాల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తీవ్ర వాయుగుండం నిన్న బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచనున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 15, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నేడు సైతం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language dated 15.08.2022 pic.twitter.com/N1YIwIJQbN
— MC Amaravati (@AmaravatiMc) August 15, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండం బలహీనపడటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)