అన్వేషించండి

Harish Rao : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు - రాజ్ నాథ్ సింగ్‌కు హరీష్ రావు లేఖ !

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయవద్దని హరీష్ రావు లేఖ రాశారు.


Harish Rao :   మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు పని లేకుండా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపణ                                         

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తనను సంప్రదించారన్న హరీష్ రావు                                                                  

డిఫెన్స్ ఫ్యాక్టరీ  ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్‌ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరు డిమాండ్లను నా ద్వారా మీ ముందు ఉంచుతున్నానని లేఖలో పేర్కొన్నారు.  

1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.

కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై వరుసగా లేఖలు               

ఇటీవల కేంద్ర ప్రభుత్వం .. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందనే ఆరోపణలు చేస్తూ..  బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందు కేటీఆర్ ఇలాంటి లేఖలు రాయగా తాజాగా హరీష్  రావు రాశారు.           

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget