News
News
X

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​, దీపావళి కానుక ఇదే!

పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో ప్రస్తుతం 3 డీఏలను చెల్లించనున్నట్లు, వాటి కోసం రూ.15 కోట్లతో పాటు డీఏ బకాయిల కోసం మరో రూ.20 కోట్లు కేటాయించడం జరుగుతోందన్నారు.

FOLLOW US: 
 
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ తెలిపింది. దీపావళి పండుగ సందర్భంగా 3 డీఏలతో పాటు పండుగ అడ్వాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధర్‌, ఎండీ వీసీ సజ్జన్నార్‌ అక్టోబరు 21న ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో ప్రస్తుతం 3 డీఏలను చెల్లించనున్నట్లు, వాటి కోసం రూ.15 కోట్లతో పాటు డీఏ బకాయిల కోసం మరో రూ.20 కోట్లు కేటాయించడం జరుగుతోందన్నారు. అలాగే, ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్‌లను కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

సకల జనుల సమ్మె సమయంలో 8053 మంది ఉద్యోగులకు జీతాలు రాలేదనీ, వీరి జీతాల చెల్లింపు కోసం రూ.25 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది ఎర్నింగ్ లీవ్స్ మొత్తాలను చెల్లించేందుకు మరో రూ.20 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణలో ఆర్టీసీ అభ్యున్నతి దిశగా పయనిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందంటూ అక్కడి ప్రభుత్వాలు సంస్థను ఆదుకోవడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కుతోందని స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే అప్పట్లో కేవలం రూ.9 కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం సంస్థకు ఓఆర్‌ ద్వారా సరాసరి రూ.14 కోట్ల వరకూ వస్తుందన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన తరువాత సంవత్సర కాలంలో సంస్థ పనితీరు ఎంతో బాగుపడిందనీ, రానున్న కాలంలో మరింత అభ్యున్నతి దిశగా పయనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

1150 కొత్త బస్సుల కొనుగోలు : ఆర్టీసీ ఎండీ
రాష్ట్రంలో ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా 1150 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. మొత్తం 1150 బస్సుల్లో 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే, 360 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం టెండర్‌ నిర్వహించనున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ డిసెంబర్‌ నాటికి బస్సులన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ తదితర అన్ని జిల్లాలకు ఇంటర్ సిటీ బస్సులను నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా సజ్జనార్‌ తెలిపారు.

News Reels

:: Read Also ::

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో 41.67 శాతం ఉత్తీర్ణులు, ఆన్సర్ కీ కూడా వచ్చేసింది!
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు అక్టోబరు 26న విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఫలితాలతోపాటు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని కూడా మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఫైనల్ కీని అందుబాటులో ఉంచింది. 
ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 22 Oct 2022 06:19 AM (IST) Tags: Diwali Bonus Diwali news Telangana RTC Bonus Telangana RTC Festival Advance

సంబంధిత కథనాలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ