అన్వేషించండి

Mallareddy : గోవాకెళ్లి ఎంజాయ్ చేస్తా ఇక పోటీ చేయను - మల్లారెడ్డి రిటైర్మెంట్

Mallareddy : ఇక ఎన్నికల్లో పోటీ చేయనని గోవాకెళ్లి ఎంజాయ్ చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కుటుంబంలోలాగే తన కుటుంబానికి మూడు పదవులు కావాలని ఆయనంటున్నారు.

Mallareddy MLA :  కేసీఆర్‌ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశిస్తే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు తమ కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  టికెట్ విషయం దాదాపు ఖరారైందన్న స్పష్టతనిచ్చారు. తమ కుటుంబాన్ని కాదని.. పోటీ చేసేంత శక్తికానీ, సామర్థ్యం కానీ ఎవరికీ లేదంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. తన కుమారుడిగి ఎంపీ టికెట్ ఆశించటం వల్ల.. మళ్లీ వారసత్వ రాజకీయాల అంశం తెరమీదికి వస్తుందన్న ప్రశ్నకు.. సీఆర్ కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని.. అలా చూసుకుంటే వాళ్ల తర్వాత తన కుటుంబంలోనే ఎక్కువ మంది పదవుల్లో ఉన్నట్టువుతుంది కదా అంటూ సరదాగా చమత్కరించారు.                 

ఎంపీ టికెట్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫోకస్‌ కావడం కోసం తన పేరు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. తన పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరన్నారు.  గతంలో రేవంత్‌రెడ్డిపై తాను చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని మల్లారెడ్డి తెలిపారు.                                      

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన భార్యతో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవటంపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని.. అందుకే స్పెషల్‌గా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. ఇప్పటికే.. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన మల్లారెడ్డి.. ఆ వార్తల్లో కూడా నిజం ఉందని స్పష్టం చేశారు. కాగా.. రంజిత్ రెడ్డి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారంటూ చెప్పుకొచ్చారు.                                  

గోవాలో తనకు హోటల్‌ ఉంది. రాజకీయాల నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్‌ చేస్తానని ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్నారు. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మల్లారెడ్డి గోవాతో పాటు దుబాయ్ లో కూడా పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు సుఖంగా ఉందేమో కానీ గోవా వెళ్లిపోతానని కామెంట్లు చేస్తున్నారు.                                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget